
కాగజ్ నగర్
తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (TSUTF) ఆధ్వర్యంలో రాబోయే రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయడానికి ఆఫీస్ బేరర్లు, నాయకులు మరియు యూనియన్ సభ్యులు చురుకుగా సహకరించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (TSUTF) జిల్లా అధ్యక్షురాలు కామ్రేడ్ వైద్య శాంతికుమారి పిలుపునిచ్చారు.
శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ మహానేతలు బాబూ జగ్జీవన్‌రామ్, జ్యోతిరావు ఫూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 12న ఉదయం 9 గంటల నుంచి కాగజ్‌నగర్ ఆదిత్య నర్సింగ్‌హోమ్‌లో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.




