Tuesday, October 13, 2026

Top 5 This Week

Related Posts

Puri Jagannadh: పూరి జగన్నాధ్ పర్సు ఖాళీనా! – PARAHUSHAR NEWS

దర్శకులకి కూడా అభిమానులు ఉంటారని నిరూపించిన వారిలో పూరి జగన్నాథ్(Puri Jagannadh)ఒకరు. హిట్, సూపర్ హిట్లకి కొలమానాలు వెతుక్కుంటున్న రోజుల్లో భారీ హిట్ లని పొందాడు. డిఫరెంట్ సబ్జెట్స్, ఎంటర్ టైన్ మెంట్ కి కూడా పెట్టింది పేరు. కానీ గతమెంతో ఘనమనే అర్దానికి పర్యాయ పదానికి నిలువెత్తు ఉదాహరణలాగా డిజాస్టర్స్ తో చాలా డీప్ గానే ఫ్రెండ్ షిప్ చేస్తున్నాడు. గత కొంత కాలంగా జీవిత సత్యాలని కూడా చెప్తూ వస్తున్న పూరి రీసెంట్ గా అలాంటివే కొన్ని చెప్పుకొచ్చాడు. ఆ మాటలు చూద్దాం.

తాజాగా పూరి ‘సమయం వర్సెస్ డబ్బు’ అనే అంశంపై మాట్లాడటం ఈ ప్రపంచంలో డబ్బు కంటే విలువైనది మరొకటి ఉంది. అదే మన దగ్గర ఉన్న ‘సమయం’. మనుషులు జీవితాంతం డబ్బు కోసం పరుగెడుతూ, అత్యంత విలువైన సమయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. పోగొట్టుకున్న డబ్బుని మళ్ళీ కష్టపడి సంపాదించుకోవచ్చు. కానీ, గడిచిపోయిన ఒక్క నిమిషాన్ని కూడా తిరిగి తీసుకురాలేం. ఈ ప్రపంచంలో అందరికీ సమానంగా లభించేది రోజుకు 24 గంటలు మాత్రమే. ఆ సమయాన్ని మనం ఎవరికి ఇస్తున్నాం, దేని కోసం ఖర్చు చేస్తున్నాం అనేదే మన జీవితాన్ని నిర్ణయిస్తుంది. ప్రతి ఉదయం మన పర్సు టైంతో నిండిపోయి ఉంటుంది. ఏం చెయ్యకపోయినా సాయంత్రానికి ఖాళీ అయిపోతుంది. మళ్ళీ ఉదయం చూసుకుంటే పర్సు ఇరవై నాలుగు గంటలతో నిండి ఉంటుంది.

ఇది కూడా చదవండి: Suriya: సూర్య హీరో కాదంట.. 20 ఏళ్ల క్రితమే పాన్ ఇండియా హీరో అని మర్చిపోకండి

డబ్బున్న వారు ఖరీదైన గడియారాలను కొనుగోలు చేయగలరు కానీ, సెకను ముల్లును ఆపలేరు. వంద కోట్లు ఉన్నవాడికైనా, చిల్లిగవ్వ లేని వాడికైనా కాలం ఒకేలా గడుస్తుంది. మన దగ్గర ఉన్న డబ్బుతో ఇతరుల సమయాన్ని కొనుగోలు చేయవచ్చు. కానీ మన ఆయుష్షును పెంచుకోలేం. కాబట్టి, మన సమయాన్ని పనికిరాని విషయాల కోసం, ద్వేషం కోసం లేదా ఇతరులను విమర్శించడం కోసం వృథా చేయకూడదు. డబ్బుని బ్యాంకులో దాచుకున్నట్లు, సమయాన్ని దాచుకోలేం. గడుస్తున్న ప్రతి సెకను మన ఖాతా నుంచి ఖర్చైపోతుంటుంది. అందుకే సమయాన్ని సరైన విషయాలపై పెట్టుబడిగా పెట్టాలి. “జ్ఞానాన్ని పెంచుకోవడానికి, మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి, మనకు నచ్చిన పనిని చేయడానికి సమయాన్ని కేటాయించాలి. ఎప్పుడైతే మనం సమయం విలువను గుర్తిస్తామో, అప్పుడే మనం జీవితంలో నిజమైన విజేతలుగా నిలుస్తాం అని పూరీ జగన్ నాథ్ పేర్కొన్నారు.

Popular Articles