నర్సాపూర్‌కు చెందిన ఎంఎన్‌ఆర్ మెడికల్ కాలేజీలో 44 ఏళ్ల ఉద్యోగి చికిత్స పొందుతూ మృతి చెందడంతో బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. అతని కుటుంబం నిర్వహణ నిర్లక్ష్యానికి కారణమని ఆరోపించింది, అతనికి సరైన సంరక్షణ నిరాకరించబడిందని పేర్కొంది, ఇది చివరికి అతని మరణానికి దారితీసింది.
ప్రచురించబడిన తేదీ – 23 నవంబర్ 2025, 11:04 PM
సంగారెడ్డి: ఎంఎన్‌ఆర్ వైద్య కళాశాలలో చికిత్స పొందుతూ మృతి చెందిన వ్యక్తి బంధువులు యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ ఆదివారం ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. నర్సాపూర్‌కు చెందిన కాశెట్టి సంతోష్‌కుమార్(44) అనే బాధితుడు 20 ఏళ్లుగా ఎంఎన్‌ఆర్ మెడికల్ కళాశాలలో పనిచేస్తున్నాడు.
నవంబర్ 20న పని ముగించుకుని ఇంటికి వస్తుండగా హత్నూర సమీపంలో సంతోష్ ప్రమాదానికి గురయ్యాడు. అతడికి ప్రథమ చికిత్స అందించి అనంతరం ఎంఎన్‌ఆర్ కళాశాల ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు.
సంతోష్ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్దకు చేరుకుని సరైన వైద్యం అందలేదని, నిర్లక్ష్యమే మృతికి కారణమని ఆరోపిస్తూ యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు.



