Monday, October 12, 2026

Top 5 This Week

Related Posts

విద్యార్థులు నైపుణ్యం పెంచుకోవాలని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పిలుపునిచ్చారు – PARAHUSHAR NEWS

ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌ మాట్లాడుతూ డిగ్రీలు పొందడం ఎంత ముఖ్యమో విద్యార్థులు కూడా నైపుణ్యాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ప్రజాపాలన 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం ఆదిలాబాద్‌ జిల్లా ఐటీడీఏ ఆధ్వర్యంలో ఉట్నూర్‌లో నైపుణ్యాభివృద్ధి అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

కార్యక్రమంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి యువరాజ్ మారమట్టి, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నైపుణ్యం లేకుంటే ఎన్ని డిగ్రీలు చదివినా ఉపయోగం లేదన్నారు. విద్యార్థులు చదువుతో పాటు స్కిల్ డెవలప్‌మెంట్‌పై దృష్టి పెట్టాలని ఆయన ఉద్ఘాటించారు. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు, యువతకు ఉచితంగా స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ తరగతులు నిర్వహిస్తోందని, అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఉపాధి పొందేందుకు విద్యార్థులు నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని ఆయన సూచించారు.

Popular Articles