Wednesday, October 14, 2026

Top 5 This Week

Related Posts

ఆర్య వైశ్యులు సిఎంకు కృతజ్ఞతలు తెలిపారు – PARAHUSHAR NEWS

తమ ఆరాధ్య దైవం శ్రీ వాసవీ మాత జయంతిని అధికారికంగా జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంపై ఆర్య వైశ్యులు సంతోషం వ్యక్తం చేశారు.

ఖానాపూర్ పట్టణంలోని శ్రీ కన్యకాపరమేశ్వరి వాసవీ మాత ఆలయంలో మున్సిపల్ మాజీ చైర్మన్, ప్రస్తుత నిర్మల్ డీసీసీ ఉపాధ్యక్షులు చిన్నం రాజుల సత్యం, ఆర్య వైశ్యులతో కలిసి వాసవీ మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఖానాపూర్‌ ఎమ్మెల్యే, నిర్మల్‌ డీసీసీ అధ్యక్షుడు వెడం బొజ్జు పటేల్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు.

ఆర్యవైశ్యులను ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం గుర్తించలేదని, సీఎం రేవంత్‌రెడ్డి గుర్తించి వాసవీ మాత జయంతిని అధికారికంగా నిర్వహించారని నాయకులు తెలిపారు. ఇంతటి గుర్తింపు కల్పించినందుకు సమాజం ఆయనకు రుణపడి ఉంటుందని వారు కృతజ్ఞతలు తెలిపారు.

Popular Articles