Wednesday, October 21, 2026

Top 5 This Week

Related Posts

రేపు పాఠశాలలు పునఃప్రారంభం – PARAHUSHAR NEWS

భువనేశ్వర్: వేసవి సెలవుల అనంతరం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు జూన్ 18న పునఃప్రారంభమవుతాయని ఒడిశా పాఠశాల, సామూహిక విద్యాశాఖ మంత్రి నిత్యానంద గోండ్ సోమవారం తెలిపారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరగడంతో వేసవి సెలవుల నిమిత్తం ఏప్రిల్ 27న పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

”విద్యార్థుల చదువుపై ప్రభుత్వం ఆందోళన చెందుతోంది.

ఒడిశాలో రుతుపవనాలు రావడంతో ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పట్టాయి. కాబట్టి జూన్ 18న అన్ని పాఠశాలలు తెరుచుకుంటాం’’ అని గోండ్ విలేకరులతో చెప్పారు. జూన్ 18న భరించలేని వేడిగాలులు వీస్తే విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తదుపరి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు త్వరితగతిన పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

సాధారణంగా, పాఠశాలల్లో వేసవి సెలవులు మే 6న ప్రారంభమై జూన్ 17 వరకు కొనసాగుతాయి. అయితే, ప్రస్తుతం ఉన్న వేడిగాలుల పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని, ప్రభుత్వం అంతకుముందు తేదీలో వేసవి సెలవులను ప్రకటించింది.

Popular Articles