Monday, October 19, 2026

Top 5 This Week

Related Posts

యువ షట్లర్లకు సాత్విక్ రెడ్డి స్ఫూర్తి – PARAHUSHAR NEWS

హైదరాబాద్: అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సాత్విక్ రెడ్డి మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుంచే విద్యా ర్థులతో పాటు పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించాలని ఉద్ఘాటించారు. నాలుగు రోజులుగా తీవ్ర పోటీల అనంతరం గాడియం స్కూల్ ఇండోర్ స్టేడియంలో బుధవారం ముగిసిన గాడియం తెలంగాణ స్టేట్ ఓపెన్ సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ 6వ ఎడిషన్ వేడుకల్లో ఆయన మాట్లాడారు.

మ్యాచ్ పాయింట్ అకాడమీకి చెందిన ఆటగాళ్లు టోర్నీలో అద్భుతమైన ప్రదర్శన చేశారు. అండర్-13 విభాగంలో కీయా కొసరాజు బంగారు పతకాన్ని కైవసం చేసుకోగా, అండర్-11 బాలికల డబుల్స్ ఈవెంట్‌లో నర్రా హర్షిణి, సాన్వి రజతం సాధించారు.

ఈ సందర్భంగా మ్యాచ్‌ పాయింట్‌ అకాడమీ వ్యవస్థాపకులు ముప్పాల వేణు మాట్లాడుతూ రానున్న కాలంలో మరింత మంది జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేయడమే తమ లక్ష్యమన్నారు. అకాడమీ కోచింగ్ సిబ్బంది క్రమశిక్షణతో కూడిన శిక్షణ మరియు అంకితభావంతో కృషి చేయడం ఈ విజయానికి కారణమని ఆయన అన్నారు.

ముగింపు కార్యక్రమంలో వివిధ విభాగాల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.

Popular Articles