Monday, October 19, 2026

Top 5 This Week

Related Posts

మార్చి 26న ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. ‘పెద్ది’ కొత్త రిలీజ్ డేట్ ఇదే! – PARAHUSHAR NEWS


రామ్ చరణ్ ‘పెద్ది’ వాయిదా
కొత్త విడుదల తేదీని ప్రకటించిన బుచ్చిబాబు
మార్చి 26న పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’

ఈ ఏడాది మార్చి 27న విడుదల కానున్న రామ్ చరణ్ ‘పెద్ది'(పెద్ది) వాయిదా పడిందని, అదే సమయంలో మార్చి 26న పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్'(ఉస్తాద్ భగత్ సింగ్) విడుదల కానుందని ఇటీవల ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగానే ‘స్తాద్ భగత్ సింగ్’ను మార్చి 26న విడుదల తాజాగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక ‘పెద్ది’ దర్శకుడు బుచ్చిబాబు కూడా తమ సినిమా ఏప్రిల్ 30న విడుదల కానుందని సోషల్ మీడియా వేదికగా తెలిపాడు.

‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్(పవన్ కళ్యాణ్), డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందిన మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాలో శ్రీలీల, రాశిఖన్నా హీరోయిన్స్. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది.

‘ఉస్తాద్ భగత్ సింగ్’ను 2026 వేసవిలో విడుదల చేసే ప్లాన్ లో మేకర్స్ ముందు నుంచీ ఉన్నారు. ఇక మార్చి 27న విడుదల కావాల్సిన ‘పెద్ది’ కూడా వాయిదా పడడంతో.. మార్చి 26న రిలీజ్ డేట్ గా లాక్ చేస్తూ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. వింటేజ్ లుక్ లో పవర్ స్టార్ కనిపించిన తీరు అదిరిపోయింది.

ఇది కూడా చదవండి: రెండు షాట్ల కోసం ఆరు నెలలు.. మహేష్ ని మార్చేసిన జక్కన్న!

‘గబ్బర్ సింగ్’ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై పవన్ కళ్యాణ్ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటిదాకా ఈ సినిమా నుంచి విడుదలైన కంటెంట్ కూడా ఆకట్టుకుంది.

సెప్టెంబర్ లో ‘ఓజీ’తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ జోష్ లో ఉన్న పవన్, ఈ ఏడాది ‘ఉస్తాద్ భగత్ సింగ్’తో మరోసారి ఆ మ్యాక్ ని రిపీట్ చేస్తారో చూడాలి.

Popular Articles