Monday, October 26, 2026

Top 5 This Week

Related Posts

మక్తల్ మున్సిపాలిటీ అభ్యర్థి ఆత్మహత్యపై బీజేపీ నిరసన – PARAHUSHAR NEWS

నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో తమ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్యపై బీజేపీ నిరసన చేపట్టింది. హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు గుమిగూడగా, పోలీసులు వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించారు.

ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్తత నెలకొంది. కొట్లాటలో ఖైరతాబాద్ డీసీపీ శిల్పవల్లి బోల్తా పడ్డారు. మహదేవప్ప మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆందోళనకారులు నినాదాలు చేశారు.

Popular Articles