Thursday, October 8, 2026

Top 5 This Week

Related Posts

బకాసుర నేతలు.. బికారీలే బినామీలు-Namasthe Telangana- PARAHUSHAR NEWS

అందులో ఓ రాజకీయ నేతకు రూ.లక్ష కోట్లు పంపాలన్న లక్ష్యంతో విలన్‌ ఓ పథకం రచిస్తాడు. నలుగురు బిచ్చగాళ్లను ఎంచుకొని, వారికి తెలియకుండానే వారి ఖాతాల్లో రూ.కోట్లు జమ చేసి, పని కానివ్వాలని అనుకుంటాడు. అయితే ఈ విషయం హీరోకు తెలిసి, విలన్‌ ప్లాన్‌కు గండికొడుతాడు. ఇప్పుడు ఈ సినిమా స్టోరీ ఎందుకు అంటారా? రంగారెడ్డి జిల్లా కొంగరకుర్దు-ఏ గ్రామంలో జరుగుతున్న భూ మాఫియా కూడా అచ్చం కుబేర సినిమాను తలపిస్తున్నది.


బకాసుర నేతలు.. బికారీలే బినామీలు
  • 400 ఎకరాల వక్ఫ్‌ భూమిపై మాఫియా దండయాత్ర
  • సిటీ శివారులో రూ.2000 కోట్ల భారీ భూ మాయ
  • తెరవెనుక చక్రం తిప్పుతున్న జంపింగ్‌ ఎమ్మెల్యే
  • తోడుగా అధికార పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే
  • నిరుపేదల పేరుతో నకిలీ ఓఆర్‌సీ ప్రొసీడింగులు
  • పట్టా భూములకు కూడా నకిలీ ఓఆర్‌సీల సృష్టి
  • రంగారెడ్డి కలెక్టరేట్‌ ముందున్న రోడ్డుకూ ఓఆర్సీ
  • సహకరిస్తున్న కందుకూరు ఆర్డీవో కార్యాలయం
  • లేఅవుట్‌లకు హెచ్‌ఎండీఏ గుడ్డిగా అనుమతులు
  • ‘22ఏ’లో ఉన్నా అగ్రిమెంట్లు చేస్తున్న ఎస్‌ఆర్‌వో
  • రాత్రికి రాత్రే బౌన్సర్ల పహారాలో ఫెన్సింగ్‌, లేఅవుట్‌
  • పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు స్వీకరించని పోలీసులు
  • ప్లాట్లు కొనుగోలు చేసి మోసపోతున్న సామాన్యులు
  • కొంగరకుర్దు (ఏ)లో దందా

శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో, ధనుష్‌ హీరోగా వచ్చిన కుబేర సినిమా గుర్తుందా?
అందులో ఓ రాజకీయ నేతకు రూ.లక్ష కోట్లు పంపాలన్న లక్ష్యంతో విలన్‌ ఓ పథకం రచిస్తాడు. నలుగురు బిచ్చగాళ్లను ఎంచుకొని, వారికి తెలియకుండానే వారి ఖాతాల్లో రూ.కోట్లు జమ చేసి, పని కానివ్వాలని అనుకుంటాడు. అయితే ఈ విషయం హీరోకు తెలిసి, విలన్‌ ప్లాన్‌కు గండికొడుతాడు. ఇప్పుడు ఈ సినిమా స్టోరీ ఎందుకు అంటారా? రంగారెడ్డి జిల్లా కొంగరకుర్దు-ఏ గ్రామంలో జరుగుతున్న భూ మాఫియా కూడా అచ్చం కుబేర సినిమాను తలపిస్తున్నది.

కొంగరకుర్దు-ఏలోని దాదాపు 400 ఎకరాలపై భూ మాఫియా కేటుగాళ్ల కన్ను పడింది. వాటిని దక్కించుకునేందుకు ఎక్కడో హైదరాబాద్‌లో నివసిస్తున్న పేదల పేరుతో నకిలీ ఓఆర్సీలు సృష్టించారు. గ్రామంలోని రైతులకు తెలియకుండా మరికొన్ని భూములను ఆక్రమించుకొని, రాత్రివేళల్లో వందలాది మంది బౌన్సర్లను పెట్టి వెంచర్లు చేస్తున్నారు. ఈ భూముల విలువ సుమారు రూ.2-3 వేల కోట్లు ఉంటుందని అంచనా. తెరవెనుక ఓ జంపు జిలానీ ఎమ్మెల్యేతోపాటు పెద్దపల్లి జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే ఉండటంతో ఈ రియల్‌ మాఫియాకు రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌, పోలీసు శాఖల అధికారులు అన్ని విధాలా సహకరిస్తూ, ఈ కథను మరింత రక్తి కట్టిస్తున్నారు.

సినీ ఫక్కీలో, నకిలీ డాక్యుమెంట్లు, బౌన్సర్ల మధ్య జరుగుతున్న ఈ భారీ దందాలో నష్టపోయిన రైతులు బీఆర్‌ఎస్‌కు ఫిర్యాదు చేశారు. ఆపై ‘నమస్తే తెలంగాణ’ ముందు తమ గోడు వెళ్లబోసుకోవడంతో ఈ రియల్‌ దందా బయటపడింది. కొంగరకుర్దు భూ దందాపై నమస్తే తెలంగాణ స్పెషల్‌ టాస్క్‌ బ్యూరో ప్రత్యేక కథనం

వీళ్లిద్దరే కాదు.. కల్వకుర్తిలో ఆటో నడుపుతున్న మరో వ్యక్తి! నగరంలో ఇంకోచోట కూలీ పని చేసుకుని జీవిస్తున్న వ్యక్తి!! ఇలా పలువురు నిరుపేదల పేరిట కొంగరకుర్దు-ఏ గ్రామ పరిధిలో పదుల సంఖ్యల ఎకరాల్లో వందల కోట్ల విలువైన భూములున్నాయి. కాకపోతే.. తమకు ఇంత ఆస్తి ఉన్నదనే విషయం వాళ్లకే తెల్వదు.

K

అందుకే వాళ్లంతా ఇంకా పేదరికంలోనే మగ్గిపోతున్నారు. ఇదేందీ.. పైన చెప్పినట్టు శేఖర్‌ కమ్ముల కుబేర సినిమా కథను మార్చి చెబుతున్నారని అనుకుంటున్నారా?! లేదు… లేదు… మన గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో, మన కండ్ల ముందే జరుగుతున్న రియల్‌ అరాచకం ఇది. ముఖ్యంగా అక్కడి రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌, పోలీసు శాఖ అధికారులకు ఈ ‘కొంగరకుర్దు కుబేర’ సినిమా కథ ముందే తెలుసు. దానికి దర్శకత్వం వహిస్తున్న వాళ్లెవరు, నిర్మాతలెవరు, సూత్రధారులు, పాత్రధారులు ఇలా అందరూ తెలుసు. తెర వెనుక ఓ జంపు జిలానీ ఎమ్మెల్యేతోపాటు పెద్దపల్లి జిల్లాకు చెందిన అధికార కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఉండటంతో అధికారులు రియల్‌ మాఫియాకు అన్నిరకాలుగా సహకరిస్తూ కథను మరింత రక్తి కట్టిస్తున్నారు.

ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఒక్కటై ఉద్దేశపూర్వకంగా కండ్లు మూసుకోవడంతో కొంగరకుర్దు-ఏ గ్రామంపై ఈ రియల్‌ మాఫియా దండయాత్ర చేస్తున్నది. దాదాపు 400 ఎకరాలు అంటే సుమారు రూ.2-3వేల కోట్ల విలువైన భూములే లక్ష్యంగా మొదలైన ఈ రియల్‌ సినిమా తరహా దందా.. ఇప్పటివరకు దాదాపు వంద ఎకరాల వరకు కైవసం చేసుకున్నది. ఇందులో 50-60 ఎకరాల వరకు లేఅవుట్‌ రూపంలో రూపుదిద్దుకున్నట్టు తెలుస్తున్నది.

దశాబ్దాలుగా ఆ భూముల్ని సాగు చేసుకుంటున్న, రెవిన్యూ రికార్డుల్లో పేర్లు వస్తున్న రైతులకే తెలియకుండా, వాళ్ల భూముల్లోనే కంటెయినర్లు వెలుస్తున్నాయి. కొన్ని రోజుల్లోనే వ్యవసాయ భూములు రియల్‌ వెంచర్లుగా మారిపోతుండటంతో గ్రామ రైతులు లబోదిబోమంటున్నారు. తమ భూముల దగ్గరికి తమనే రానీయకుండా బౌన్సర్లతో బెదిరిస్తున్నారంటూ రెవెన్యూ, పోలీసు అధికారుల ముందు వాపోయినా న్యాయం దక్కకపోవడంతో న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్నిరోజుల కిందట బీఆర్‌ఎస్‌కు కొందరు బాధితులు ఫిర్యాదు చేశారు. ఆపై ‘నమస్తే తెలంగాణ’ ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు. దశాబ్దాలుగా తమ కుటుంబానికి ఆధారంగా వస్తున్న రూ.కోట్ల భూములు తమ కండ్ల ముందే, తమకు కాకుండా పోతున్న వైనాన్ని చెప్పుకొంటూ కన్నీరుమున్నీరవుతున్నారు.

సీన్‌-1
చికెన్‌ సెంటర్‌ వ్యాపారిపేరిట 300 కోట్ల భూమి!

A

కాట్రావత్‌ నర్సింహ ఓ చికెన్‌ సెంటర్‌ వ్యాపారి. తండ్రి పేరు భిక్షపతి. ప్రస్తుతం బడంగ్‌పేట పరిధిలోని బాలాజీనగర్‌లో నివాసముంటున్నాడు. 30 ఏండ్ల కిందట నగరానికి వచ్చిన నర్సింహ కుటుంబం సొంత ఊరు నల్లగొండ జిల్లా డిండి మండలంలోని చెరుకుపల్లి తండా. ఈ నర్సింహకు కొంగరకుర్దు-ఏ గ్రామంలో దాదాపు 50-60 ఎకరాల భూమి ఉన్నదట. ఎకరా ధర కనీసంగా రూ.5-6 కోట్లు అనుకున్నా.. నర్సింహ ఆస్తి విలువ రూ.250-300 కోట్ల పైమాటే మరి.

కోటీశ్వరుడైన నర్సింహ.. సిటీలో చికెన్‌ సెంటర్‌ నడుపుకొంటూ జీవితంవెళ్లదీయడమేంది? అనే కదా మీ అనుమానం. తన పేరిట 60 ఎకరాల భూమి ఉన్నదన్న విషయం కూడా అతనికి తెల్వదు. అంతేనా.. రేపోమాపో ఆ భూముల్లో హెచ్‌ఎండీఏ అనుమతితో ఓ వెంచర్‌ వెలియనున్నది. అక్కడ చదరపు గజం రూ.40 వేల చొప్పున పెద్ద ఎత్తున రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కూడా జరుగనుంది. అంటే వందల కోట్ల వ్యాపారం జరిగినా నర్సింహకు మాత్రం తెలియదు. నర్సింహ పేరు మీద సృష్టించిన ఓఆర్‌సీ (ఆక్యుపెన్సీ రైట్‌ సర్టిఫికెట్‌)లో ఆయనది కొంగరకుర్దు-ఏగా చూపారు. కానీ ఆధార్‌ కార్డులో మాత్రం బడంగ్‌పేట బాలాజీనగర్‌ చిరునామాగా ఉన్నది.

సీన్‌-2
అద్దె ఇంట్లో ఉండే మహిళకు 80 ఎకరాలట!

Women2

కొండన్‌ లక్ష్మి అనే మహిళ అద్దె ఇంట్లో ఉంటారు. ఆమె తండ్రి పేరు సత్యనారాయణ. సొంతూరు మహేశ్వరం మండలంలోని కందుకూరు. అత్తగారి ఊరు నారాయణఖేడ్‌. కొంతకాలం క్రితం వరకు రాజేంద్రనగర్‌ పరిధిలోని లక్ష్మీగూడ గృహకల్పలో నివాసముండేవారు. ఇప్పుడు మైలార్‌దేవ్‌పల్లిలో ఒక అద్దె ఇంటికి మారారు. లక్ష్మికి సైతం కొంగరకుర్దు-ఏ గ్రామంలో 70-80 ఎకరాల భూమి ఉన్నదట. అందులో ఇప్పటికే 17 ఎకరాల భూమిలో అందమైన బ్రోచర్లతో భారీ లేఅవుట్‌ కూడా తయారైంది.

చదరపు గజం రూ.40 వేలకు అమ్ముతున్నారు. మరో 40-50 ఎకరాల భూములకు సంబంధించి ఓఆర్‌సీలు, ఇతర ప్రొసీడింగ్స్‌ అన్నీ సిద్ధంగా ఉన్నాయి. త్వరలో ఆ భూముల్లోనూ లేఅవుట్‌కు హెచ్‌ఎండీఏ అనుమతి ఇవ్వబోతున్నది. మహేశ్వరం సబ్‌ రిజిస్ట్రార్‌ వేల చదరపు గజాలను లక్ష్మి నుంచి ఇతరులకు డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్‌ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. మరి… వందల కోట్ల లావాదేవీలు జరుగుతున్నా లక్ష్మి మాత్రం అద్దె ఇంట్లో ఉంటూ ఇంకా పేదరికంలోనే ఎందుకు మగ్గుతున్నారు. ఆమె పేరు మీద తీసిన ఓఆర్‌సీలోనూ కొంగరకుర్దు-ఏ గ్రామంగా పేర్కొన్నారు. కానీ ఆధార్‌ కార్డులో మాత్రం లక్ష్మి ఇంటి అడ్రస్‌ మైలార్‌దేవ్‌పల్లి గృహకల్పగా ఉన్నది.

ట్విస్ట్‌-1
ఇదీ కొంగరకుర్దు-(ఏ) భూముల కథ
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల కొంగరకుర్దు-ఏ గ్రామ పరిధిలోని భూములకు సంబంధించి 400 వరకు సర్వేనంబర్లు ఉన్నాయి. 1954-55 ఖాస్రా పహాణీలో ఈ భూములు పట్టా, జాగిర్దారీ, ఇనాం భూములుగా నమోదై ఉన్నాయి. ఈ క్రమంలో అంతకుముందు నుంచి గ్రామానికి చెందిన రైతులు వాటిల్లో సాగు చేసుకుంటూ ఉన్నారు. అయితే 1961లో హైదరుద్దీన్‌ అనే వ్యక్తి ఈ భూములన్నీ వక్ఫ్‌ భూములంటూ ఉత్తర్వులు తీసుకొచ్చారు. అయితే, రైతులు హైకోర్టును ఆశ్రయించి, ఎట్టకేలకు ఆ ఉత్తర్వులను కొట్టివేయించారు. ఆ తర్వాత నుంచి రెవెన్యూ రికార్డుల్లో కాస్తులో ఉన్న రైతుల పేర్లు నమోదవుతూ వస్తున్నాయి. రైతుల్లో కొందరు ఓఆర్‌సీలు తీసుకోగా మరికొందరు ఓఆర్‌సీలు పొందకుండానే సాగు చేసుకుంటూ వస్తున్నారు.

ఎలాగూ వీళ్ల పేర్లు రెవెన్యూ రికార్డుల్లో ఉండటంతో రిజిస్ట్రేషన్‌ లావాదేవీలు కూడా జరిగాయి. కానీ 2007లో వైఎస్‌ హయాంలో గ్రామంలోని 2 నుంచి 400 వరకు సర్వేనంబర్లలోని దాదాపు 600 ఎకరాల భూములు మళ్లీ వక్ఫ్‌ భూములుగా నమోదు చేస్తూ అప్పటి ప్రభుత్వం వక్ఫ్‌ బోర్డు నుంచి గెజిట్‌ జారీచేసింది. దీంతో కొంగరకుర్దు-ఏ గ్రామంలోని వందల ఎకరాలపై మళ్లీ చిక్కుముడి పడింది. అప్పటినుంచి ఈ క్షణం వరకు ఈ భూములన్నీ వక్ఫ్‌ భూములుగా నమోదవుతూ… 22ఏ నిషేధిత జాబితాలోనే వస్తున్నాయి. అధికారికంగా లావాదేవీలు నిలిచిపోయాయి. వక్ఫ్‌ జాబితాలో పడినవాటిలో కొన్ని నిజమైన పట్టా భూములు కూడా ఉన్నాయని రైతులు తెలిపారు. ఈ క్రమంలో రైతులు మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు.

ఏండ్ల తరబడి న్యాయ పోరాటం చేస్తున్నారు. రైతులు ఎవరికి వారు హైకోర్టును ఆశ్రయించి తమ భూముల్ని 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించాలని కోరగా… కొన్ని కేసుల్లో హైకోర్టు ఆ మేరకు తొలగించాలంటూ ఉత్తర్వులు ఇచ్చింది. కానీ ఇప్పటివరకు వక్ఫ్‌ జాబితాలోని ఏ ఒక్క సర్వేనంబరును కూడా రెవెన్యూ శాఖ నిషేధిత జాబితా నుంచి తొలగించి, పాసు పుస్తకాలు జారీ చేయలేదు. వక్ఫ్‌ బోర్డు కూడా 2007లో ఇచ్చిన గెజిట్‌ను ఇప్పటివరకు ఉపసంహరించుకోవడం, అందులోని సర్వేనంబర్లను తొలగిస్తూ మరో గెజిట్‌ జారీ చేయడంగాని చేయలేదు. దీంతో 2025, డిసెంబరులో రంగారెడ్డి కలెక్టర్‌ నారాయణరెడ్డి రిజిస్ట్రేషన్‌ శాఖ ఐజీకి పంపిన జాబితాలో కూడా ఈ సర్వే నంబర్లన్నీ వక్ఫ్‌ భూములుగా పేర్కొంటూ నిషేధిత జాబితాలో ఉంచారు. అయినప్పటికీ హైకోర్టును ఆశ్రయించి పలువురు ఉత్తర్వులు తీసుకువచ్చినా రెవిన్యూ శాఖ పరంగా అవి అమలులోకి రాలేదు. అంటే ఆ భూములన్నీ ఇప్పటికీ నిషేధిత జాబితాలోనే ఉన్నట్టు రిజిస్ట్రేషన్‌ శాఖ వెబ్‌సైట్‌లో కనిపిస్తున్నది.

ట్విస్ట్‌-2
రియల్‌ మాఫియా కన్ను

కొంగరకుర్దు-ఏ పరిధిలోని ఈ భూముల్లోనే రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయం వచ్చింది. గతంలో ఔటర్‌ రింగ్‌రోడ్డు ఈ భూముల మీదుగానే నిర్మాణమైంది. చుట్టుపక్కల భూముల్లో అనేక కంపెనీలు వచ్చాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత బొంగళూరు ఔటర్‌ జంక్షన్‌ నుంచి ఆకుతోటపల్లి వరకూ నిర్మిస్తున్న 300 ఫీట్ల గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్డు కూడా ఈ భూముల మీదుగానే వెళుతున్నది. దీంతో ఈ భూములకు భారీగా డిమాండ్‌ పెరిగింది. మొన్నటిదాకా ఒకట్రెండు కోట్లు కూడా పలకని ఎకరం భూమి.. ఇప్పుడు కనీసం రూ.5-6 కోట్ల వరకు ధర పలుకుతున్నది. అయితే ఈ భూములన్నీ వక్ఫ్‌ జాబితాలో ఉండటంతో లావాదేవీలు మాత్రం జరుగడం లేదు. ఈ క్రమంలో ఈ భూములపై రియల్‌ మాఫియా కన్నుపడింది. ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన బడా రాజకీయ నాయకులు తెరవెనుక ఉండి చక్రం తిప్పుతుండటంతో రైతుల భూములపై మాఫియా దండయాత్ర మొదలుపెట్టింది. ఎలాగూ వక్ఫ్‌ భూములు అంటే ఇనాం భూములు అని ఉండటంతో పెద్ద ఎత్తున నకిలీ ఓఆర్‌సీలను సృష్టించి భూములను కొల్లగొడుతున్నారు.

ట్విస్ట్‌-3
పోలీసుల దగ్గరా దొరుకని న్యాయం

ఈ అన్యాయంపై ఆదిబట్ల పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినా నామమాత్రంగా ఫిర్యాదు తీసుకొని చేతులెత్తేయడం.. లేకపోతే అసలు ఫిర్యాదే తీసుకోకపోవడం చేస్తున్నారని బాధిత రైతులు వాపోతున్నారు. దీంతో మిన్నకుండిపోవడం… పరిచయాలు ఉన్న వాళ్లు హైకోర్టును ఆశ్రయించడం చేస్తున్నారు. ఇక, మరోవైపు.. మాఫియా మాత్రం ఆ వెంచర్లలోని ప్లాట్లను చదరపు గజం రూ.40 వేల చొప్పున విక్రయిస్తున్నారు. ఇవేవీ తెలియని సామాన్యులు అందులో భూములను కొనుగోలు చేస్తున్నారు. సామాన్యులు కొనుగోలు చేసే ప్లాట్లకు సంబంధించిన భూమి భూభారతిలో గ్రామానికి చెందిన రైతు పేరు మీద ఉంటుంది. పైగా అది వక్ఫ్‌ బోర్డు భూమిగా 22ఏ నిషేధిత జాబితాలో కనిపిస్తుంది. అసలు గ్రామానికి సంబంధంలేని వ్యక్తి పేరిట ఉన్న ఓఆర్‌సీ, నాలా కన్వర్షన్‌పై రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. అంటే… భవిష్యత్తులో వాటి పరిస్థితి గందరగోళమనేది సుస్పష్టం.

ట్విస్ట్‌-4
నమస్తే పరిశీలనలో నకిలీల గుట్టురట్టు

కొంగరకుర్దు గ్రామ రైతులు తమ గోడును నమస్తే తెలంగాణకు వెళ్లబోసుకున్నారు. దీంతో మహేశ్వరం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో డాక్యుమెంట్లు చేసిన రెండు ఓఆర్‌సీలపై నమస్తే తెలంగాణ
క్షేత్రస్థాయి విచారణ చేసింది. రెండింట్లోనూ అనేక సందేహాలు తలెత్తాయి.

ట్విస్ట్‌-5
హైడ్రామా నడిపిన సబ్‌ రిజిస్ట్రార్‌…
భూభారతిలో ఒకరి పేరు.. పైగా 22ఏ నిషేధిత జాబితాలో వక్ఫ్‌బోర్డు భూమిగా నమోదు. అసలు ఓఆర్‌సీలు వాస్తవమో కాదో తెల్వదు… కానీ మహేశ్వరం సబ్‌ రిజిస్ట్రార్‌ మాత్రం కొంగరకుర్దు-ఏ గ్రామ సర్వేనంబర్లలోని భూముల్లో భారీ ఎత్తున డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్లు పూర్తి చేశారు. సామాన్యుడు వస్తే 22ఏ బూచి చూపించే అధికారులు ఈ విషయంలో మాత్రం కలెక్టర్‌ 22ఏ జాబితాను ఉల్లంఘించి మరీ పదుల సంఖ్యలో ఎకరాల్లోని భూమిని దశాబ్దాల కిందటి నాలా కన్వర్షన్‌ ఉత్తర్వుల ఆధారంగా చదరపు గజాల్లో అగ్రిమెంట్లు చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఈ భారీ రాకెట్‌ విషయం నమస్తే తెలంగాణ దృష్టికి వచ్చిన తర్వాత సబ్‌ రిజిస్ట్రార్‌ శ్రీధర్‌రెడ్డిని సంప్రదించడంతో కాట్రావత్‌ నర్సింహకు సంబంధించిన డాక్యుమెంట్‌ను పెండింగులో పెట్టారు. ఓఆర్‌సీలు, నాలా అనుమతుల ప్రొసీడింగ్స్‌ నిజమైనవా? కావా? అని ఆర్డీవో కార్యాలయానికి లేఖ రాసినట్లు నమస్తే విలేకరికి తెలిపారు. ఆ వెంటనే విలేకరి కందుకూరు ఆర్డీవో కార్యాలయానికి వెళ్లగా అప్పుడే కార్యాలయ ఏఓ వాట్సాప్‌నకు సబ్‌ రిజిస్ట్రార్‌ లేఖ పంపారు.

అంటే అప్పటికే పంపారన్నది అవాస్తవం. ఆ తర్వాత ఆ సర్వేనంబర్లకు సంబంధించి నిజమైన రైతులు సబ్‌ రిజిస్ట్రార్‌ను నిలదీయడంతో చివరికి నాలుగు అగ్రిమెంట్‌ డాక్యుమెంట్లు తిరస్కరిస్తున్నట్లు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. ఇక్కడ కీలక విషయమేందంటే.. నమస్తే తెలంగాణ వెళ్లిన సమయంలో ఓఆర్‌సీలు, ప్రొసీడింగ్స్‌పై ఆర్డీవో కార్యాలయాన్ని విచారిస్తున్నట్లు అబద్ధం చెప్పిన సబ్‌రిజిస్ట్రార్‌ మరి అప్పటికే పూర్తిచేసిన పలు డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్ల విషయంలో మాత్రం అందులోని ఓఆర్‌సీలు, ప్రొసీడింగ్స్‌పై కనీసంగా విచారించలేదంటే రాకెట్‌లో ఆయన పాత్ర ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఇదే అదునుగా భూ మాఫియా రెవెన్యూ శాఖతో ఏమాత్రం సంబంధం లేకుండానే ఓఆర్‌సీలు, నాలా కన్వర్షన్‌ ప్రొసీడింగ్స్‌ చూపిస్తూ చదరపు గజాల్లో ఎకరాలకొద్దీ భూములపై లావాదేవీలు చేస్తున్నది.

ట్విస్ట్‌-6
కందుకూరు ఆర్డీవో ఆఫీసు రూటే సపరేటు

కొంగరకుర్దు-ఏ గ్రామ భూములకు సంబంధించిన రికార్డులు చూపేందుకు కందుకూరు ఆర్డీవో కార్యాలయ అధికారులు, సిబ్బంది సామాన్యుడిని నరకయాతనకు గురిచేస్తున్నారు. వాస్తవానికి గతంలో నిజమైన, కబ్జా ఉన్న రైతులకు ఇచ్చిన ఓఆర్‌సీలకు సంబంధించి కార్యాలయంలో విచారణ చేస్తే ఆ ఫైల్స్‌ కనిపిస్తలేవని సమాధానమిస్తున్నారు. కానీ రియల్‌ మాఫియా తయారు చేసిన నకిలీ ఓఆర్‌సీలు, ప్రొసీడింగ్స్‌ ఈ కార్యాలయంలో అందుబాటులో ఉండటం రాకెట్‌లో కార్యాలయ భాగస్వామ్యానికి నిదర్శనం. నమస్తే తెలంగాణ విచారణలో కాట్రావత్‌ నర్సింహ తండ్రి భిక్షపతి పేరిట ఉన్న ఓఆర్‌సీ, ప్రొసీడింగ్స్‌ కార్యాలయంలో ఉన్నట్టు తేలింది.

మరి నర్సింహ తండ్రి భిక్షపతికి కొంగరకుర్దు గ్రామానికి అసలు సంబంధమే లేదు. పైగా ఈ భూములకు సంబంధించి గతంలో ఓఆర్‌సీ ఉన్న, తదుపరి భూములు కొనుగోలు చేసి భూభారతిలో పేర్లు ఉన్నరైతులు.. రెవెన్యూ కార్యాలయాల్లో ఫిర్యాదులు చేస్తున్నారు. అయినప్పటికీ ఆ భూములపై గ్రామానికి సంబంధంలేని వ్యక్తి పేరిట ఓఆర్‌సీ కందుకూరు ఆర్డీవో కార్యాలయంలో ఉందంటే తెర వెనుక ఏం జరుగుతుందనేది అర్థం చేసుకోవచ్చు. అయితే వెలుగులోకి రాని ఇలాంటి తతంగాలు ఇంకెన్ని ఉన్నాయనేది ఉన్నతాధికారులు విచారిస్తే తేలుతాయి.

ట్విస్ట్‌-7
హెచ్‌ఎండీఏ అధికారి పొంతనలేని సమాధానం

కొంగరకుర్దు గ్రామ భూములు వక్ఫ్‌ జాబితాతో 22ఏ నిషేధంలో ఉన్నాయనేది అందరికీ తెలిసిన విషయం. కానీ కేవలం దశాబ్దాల కిందటి తేదీలపై ఉన్న ఓఆర్‌సీలు, నాలా కన్వర్షన్‌ కాగితాల మీదనే హెచ్‌ఎండీఏ అధికారులు భారీ లేఅవుట్లకు అనుమతులు ఇస్తున్నారు. అసలు ఆ భూములు 22ఏలో ఉన్నాయా? లేదా? భూభారతిలో ఎవరి పేర్లు ఉన్నాయి? నిజంగా నాలా అనుమతులు ఉంటే భూభారతిలో నమోదు కావాలి కదా.. పైగా లేఅవుట్‌ దరఖాస్తు వెంట వచ్చిన ఓఆర్‌సీలు నిజమైనవా? కావా? ఇలా అన్ని కోణాల్లో కనీస విచారణ చేయాల్సిన హెచ్‌ఎండీఏ అధికారులు గుడ్డిగా లేఅవుట్‌ అనుమతులు ఇస్తున్నారంటే తెర వెనుక పెద్దల ఒత్తిడి, అధికారుల అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదే విషయమై నమస్తే తెలంగాణ ప్రతినిధి.. హెచ్‌ఎండీఏ చీఫ్‌ ప్లానింగ్‌ అధికారి రవీందర్‌రెడ్డిని సంప్రదించగా… హెచ్‌ఎండీఏలోని రెవెన్యూ విభాగం క్లియరెన్స్‌ తర్వాతనే తాను అనుమతులు ఇచ్చినట్లు చెప్పడం గమనార్హం. అంటే కనీసం క్షేత్రస్థాయి పరిశీలన లేకుండా గుడ్డిగా అనుమతులు ఇస్తుండటం అందరినీ విస్మయానికి గురి చేస్తున్నది.

నకి‘లీలలు’ ఎన్నెన్నో..!
రియల్‌ మాఫియా సృష్టిస్తున్న ఓఆర్‌సీలు, ప్రొసీడింగ్స్‌ నకిలీవి అనేందుకు, హెచ్‌ఎండీఏ అధికారులు గుడ్డిగా, అవినీతిలో మునిగి అనుమతులు ఇస్తున్నారనేందుకు మరికొన్ని విస్తుపోయే అంశాలు కూడా ఉన్నాయి.

నకిలీ-1
గ్రామ పరిధిలోని 57, 190, 191, 192 సర్వేనంబర్లలోనివి వాస్తవానికి పట్టా భూములు. భూభారతిలో ఇందుకు సంబంధించి రైతుల పేర్లు, పట్టా భూములుగా నమోదై ఉన్నాయి. కానీ రియల్‌ మాఫియా విచ్చలవిడిగా నకిలీ ఓఆర్‌సీలు సృష్టించే క్రమంలో ఈ పట్టా భూములకూ ఓఆర్‌సీలు తయారు చేశారు. నిబంధనల మేరకు ఇనాం భూములకు మాత్రమే ఓఆర్‌సీలు కావాలి. కానీ పట్టా భూములకు ఓఆర్‌సీలు ఎందుకనే లాజిక్‌ను మాత్రం మరచిపోయారు. అడ్డంగా దొరికిపోయారు.

నకిలీ-2
సర్వేనంబరు 85లో 5.20 ఎకరాల భూమి ఉంది. ఇందులో 1.20 ఎకరాల్లో రంగారెడ్డి కలెక్టరేట్‌ ముందుగా ఉన్న వంద ఫీట్ల రోడ్డు వేశారు. కానీ రియల్‌ మాఫియా 85లోని 5.20 ఎకరాలకు ఓఆర్‌సీలు సృష్టించింది. పైగా హెచ్‌ఎండీఏ అధికారులు అనుమతులు ఇచ్చిన లేఅవుట్‌లో 85 సర్వేనంబరు ఉండగా అందులో 5.20 ఎకరాల విస్తీర్ణం ఉంది. అంటే హెచ్‌ఎండీఏ కలెక్టరేట్‌ ముందు ఉన్న వంద ఫీట్ల రోడ్డును తీసివేసి లేఅవుట్‌ చేయమని అనుమతి ఇవ్వడం వారికే చెల్లింది. ఇదే సర్వేనంబరులో వంద ఫీట్ల రోడ్డు వేసినపుడు చేపట్టిన భూసేకరణలో భాగంగా నిజమైన రైతుకు పరిహారం కింద కోర్టులోనే సుమారు రూ.89 లక్షలను అధికారులు డిపాజిట్‌ చేశారు. అంటే ఆ భూమికి యజమాని సదరు రైతు అనేది నిర్ధారణ అయ్యింది. కానీ ఆ భూమికి కూడా మాఫియా ఇతర ప్రాంతానికి చెందిన వ్యక్తి పేరిట నకిలీ ఓఆర్‌సీ సృష్టించి లేఅవుట్‌ అనుమతి పొంది రైతుకు తెల్వకుండానే భూమిని ఆక్రమించుకుంది.

నకిలీ-3
కొన్ని ఓఆర్‌సీల్లో హైదరాబాద్‌ జిల్లా అని ముద్ర ఉండటం గమనార్హం. వాస్తవానికి 1976లోనే రంగారెడ్డి జిల్లా ఏర్పడింది. కానీ 1988, 1992 ప్రాంతాల్లో ఇచ్చిన ఓఆర్‌సీలపై హైదరాబాద్‌ జిల్లా అని ముద్ర ఉండటమంటే మాఫియా అరాచకాలు ఏస్థాయిలోనివో అర్థం చేసుకోవచ్చు.

D

నమస్తే ముందు బాధితుల గోడు
రియల్‌ మాఫియా అరాచకాలపై పలువురు రైతులు నమస్తే తెలంగాణ ముందు గోడు వెళ్లబోసుకున్నారు. అసలు తమకు సమాచారం లేకుండానే తమ భూముల్ని ఆక్రమించి వెంచర్లు చేసి ప్లాట్లుగా అమ్ముతున్నారని వాపోయారు. వారిలో రామిడి ప్రతాప్‌రెడ్డి – (సర్వే నంబర్‌ 57-1.03 ఎకరాలు), శ్రీనివాస్‌రెడ్డి, యాదిరెడ్డి, భూపాల్‌రెడ్డి (సర్వేనంబర్‌ 193,194,195 – 5.08 ఎకరాలు), కొర్రే ప్రమీల (సర్వేనంబర్‌ 75- 3 ఎకరాలు), అచ్చన లక్ష్మయ్య (1.38 ఎకరాలు), అచ్చన మల్లేశ్‌కు (1.39 ఎకరాలు), జే జనార్దన్‌రెడ్డికి చెందిన (సర్వేనంబర్‌ 68, 69, 71,72, 75, 179, 181, 180 – 16 ఎకరాలు), పన్నాల శ్రీనివాస్‌రెడ్డి, యాదిరెడ్డి (సర్వే నంబర్‌ 193,194, 195- 4.30 ఎకరాలు) తదితరులు ఉన్నారు. తమలా ఇంకా బయటికిరాని రైతులు అనేకమంది ఉన్నారని, నకిలీ ఓఆర్‌సీలు తయారు చేసిన సర్వేనంబర్లు ఇంకా అనేకం ఉన్నాయని బాధితులు చెప్తున్నారు.

మొదటి ఓఆర్‌సీలో ఏం తేలిందంటే?
కాట్రావత్‌ నర్సింహ, ఆయన తండ్రి బిక్షపతి పేరిట 1994లో ఓఆర్‌సీ (నెం.జె/4498/1988, తేది: 11.4. 1989) సృష్టించారు. సర్వే నంబరు 63, 64, 66, 69, 71, 72, 75, 78ల్లో 10.03 ఎకరాల విస్తీర్ణాన్ని అందులో పేర్కొన్నారు. 2011లో నర్సింహ నాలా అనుమతి తీసుకున్నట్లు ప్రొసీడింగ్‌ చూపారు. దీని ఆధారంగా 48,763 చదరపు గజాలు (10.03 ఎకరాలు) నర్సింహ ఎవర్‌గ్రీన్‌ రియల్టర్స్‌కు డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్‌ కమ్‌ ఇర్రికవరబుల్‌ జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ చేస్తూ ఆగస్టు 24వ తేదీన డాక్యుమెంట్‌ నంబరు 241/2026 రూపొందించారు. ఈ డాక్యుమెంట్‌ను కొంతకాలం పెండింగులో పెట్టిన సబ్‌ రిజిస్ట్రార్‌ ఆపై తిరస్కరించారు. కాగా నమస్తే తెలంగాణ నర్సింహ ఆధార్‌ కార్డులోని చిరునామా ఆధారంగా విచారణ చేస్తే… అసలు తనకు ఎక్కడా గుంట భూమి కూడా లేదని తేల్చి చెప్పాడు. మరి రిజిస్ట్రేషన్‌ ఎలా చేశారని అడిగితే సమాధానం దాటవేశారు. తనకేమీ సంబంధంలేదని, ఎవరైనా డబ్బులిస్తే అది క్యాన్సిల్‌ కూడా చేస్తానని చెప్పడం గమనార్హం.

రెండో ఓఆర్‌సీ కథ ఇది..
కొండన్‌ లక్ష్మి, ఈమె తండ్రి సత్యనారాయణ పేరు మీద రెండు ఓఆర్‌సీల ఆధారంగా మహేశ్వరం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో 84,095 చదరపు గజాలు (17.37 ఎకరాలు) లక్ష్మితో పాటు మరో ఇద్దరు వ్యక్తులు సిద్దాపురం ఆకాశ్‌రెడ్డి, షకీబ్‌ ముర్తుజాకు ఈ ఏడాది జూలై 7వ తేదీన డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్‌ కమ్‌ ఇర్రికవరబుల్‌ జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ చేశారు. ఇందులో లక్ష్మి తండ్రి సత్యనారాయణకు సర్వేనంబరు 54-57 వరకు 7.03 ఎకరాలకు 1989లో ఓఆర్‌సీ (నెం.జె/4519/1988, తేది:27.7.1989) జారీ అయినట్లుగా చూపారు. అదేవిధంగా సర్వేనంబర్లు 190-194 వరకు 10.12 ఎకరాలకు 1989లో ఓఆర్‌సీ (నెం.జె/4524/ 1988, తేది:16.5.1989) జారీ అయినట్లుగా డాక్యుమెంట్‌లో పేర్కొన్నారు.

అయితే ఆధార్‌ కార్డులోని చిరునామా ఆధారంగా నమస్తే తెలంగాణ విచారణ చేసింది. ఆమె తొలుత ఫోనులో అసలు తనకెక్కడా భూమి లేదని చెప్పింది. కానీ కొంతసేపటికి ఆమెను స్వయంగా కలవగా.. మాది వాస్తవానికి కరీంనగర్‌ జిల్లా. కొన్నేండ్ల కిందట మా నాన్న సత్యనారాయణ మహేశ్వరం మండలం కందుకూరుకు వలస వచ్చారు. కొందరు పటేళ్ల దగ్గర పని చేస్తే వాళ్లు పదెకరాల భూమి ఇచ్చిండ్రంట. 30 ఏండ్ల కిందట చనిపోయిన మా నాన్న ఆ పదెకరాల భూమిని నా పేరు మీద వీలునామా రాసినట్లు ఒకాయన చెప్పిండు.

కానీ ఆ భూమిలో మరికొంత మంది రెడ్లు కబ్జాలో ఉన్నారట. మా అడ్వకేట్‌ కొట్లాడుతానంటే నేను సంతకం చేసిన. వాళ్ల కబ్జాలో ఉన్న నా భూమి కోసం నేను కోర్టుల కేసు వేసిన అని చెప్పారు. కానీ వాస్తవానికి.. తన తండ్రి ఓఆర్‌సీ ద్వారా తనకు సంక్రమించిన 17.37 ఎకరాల భూమిని 22ఏ నిషేధిత జాబితాలో తొలగించి, రిజిస్ట్రేషన్‌ చేసేందుకు అనుమతి ఇప్పించాలని ఆమె పేరిట హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. దాని ఆధారంగా మహేశ్వరం ఎస్‌ఆర్‌వో డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్‌ పూర్తి చేశారు. అదే భూమిలో ఇప్పుడు వెంచర్‌ ఉన్నట్లు, ప్లాట్లు అమ్ముతున్నట్లుగా ఆమెకు తెల్వదు.

66

నకిలీల గుట్టు విప్పిన ఐఏఎస్‌ బాల మాయాదేవి…
కొంగరకుర్దు-ఏలోని సర్వేనంబరు 86, 87ల్లో 24.15 ఎకరాలు నక్క యాదయ్య పేరిట ఓఆర్‌సీని, నాలా కన్వర్షన్‌ ప్రొసీడింగ్స్‌ను రూపొందించారు. అదేవిధంగా 86, 87సర్వేనంబర్లలో మరో 28.10ఎకరాలకు ఇ రాము పేరిట ఉత్తర్వులు తయారు చేశారు. వాస్తవానికి ఈ ఇద్దరికీ కొంగరకుర్దు గ్రామంతోగానీ, ఆ భూములతోగానీ సంబం ధం లేదు. వారు గ్రామానికి చెందినవారే కాదు. ఈ ఉత్తర్వులతో ఆ సర్వేనంబర్లలోని భూమిని గత ఏడాది మాఫియా ఆక్రమించింది.

దీంతో సదరు యజమాని ఆదిబట్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో విచారణలో భాగంగా ఆ ఉత్తర్వుల్లో ఉన్న అధికారితో స్పష్టత తీసుకోవాలని పోలీసులుభావించి.. ప్రస్తు తం ఐఏఎస్‌ హోదాలో బీసీ సంక్షేమశాఖ కమిషనర్‌గా ఉన్న బీ బాలమాయాదేవికి 20.05.2025న లేఖ రాశారు. స్పందించిన కమిషనర్‌ 28.5.2025న ఆదిబట్ల పోలీసులకు లిఖితపూర్వకంగా సమాధానమిస్తూ..1995లో తన పేరుతో మొత్తం 52.25 ఎకరాలకు సంబంధించి చెలామణి చేస్తున్న నాలుగు ఓఆర్‌సీ, ప్రొసీడింగ్స్‌లో తనదిగా చెప్తున్నసంతకం తనదే కాద ని, దీంతో ఆ ఉత్తర్వులు నకిలీవిగా కనిపిస్తున్నట్లు స్పష్టం చేశారంటే నకిలీ ఓఆర్‌సీలతీరు ఎలాఉందో అవగతమవుతుంది.

పోలీసులు పట్టించుకోవడం లేదు
మా మామ నా పెండ్లికి కట్నం కింద సర్వే నంబర్‌ 75లో మూడు ఎకరాల భూమి ఇచ్చాడు. ఇప్పటికీ కబ్జాలో మేమే ఉన్నాం. వ్యవసాయం చేస్తున్నాం. రికార్డులో మా పేరు ఉంది. కానీ ప్రభుత్వం 22ఏలో పెట్టింది. ఇప్పుడు.. మాకు తెలియకుండానే మా భూమిని కాట్రావత్‌ నర్సింహ్మ అనే వ్యక్తి, తన పేరు మీద చేయించుకుని ఎవర్‌గ్రీన్‌ అనే రియల్‌ఎస్టేట్‌ సంస్థకు డెవలప్‌మెంట్‌ రిజిష్ర్టేషన్‌ చేశాడు. ఎట్లా చేశాడో కూడా మాకు తెలియదు. సబ్‌రిజిస్ట్రార్‌ను నిలదీయడంతో రిజిస్ట్రేషన్‌ పెండింగ్‌లో పెట్టానని, దానిని క్యాన్సిల్‌ చేస్తానని సంతకం చేసి, ఓ పత్రం ఇచ్చాడు. ఈ విషయంపై ఆదిబట్ల పోలీసులకు ఫిర్యాదు చేసి వారం రోజులు అవుతున్నా పట్టించుకోవడం లేదు.
– కొర్రే నర్సింహ్మ, ఆదిబట్ల, బాధిత రైతు

కోర్టు ఆర్డర్‌ ఉన్నా పట్టించుకోవట్లే
1994 సంవత్సరంలో సర్వేనంబర్‌ 193, 194, 195 లోని 4.30 ఎకరాల భూమిని భూపాల్‌రెడ్డి అనే రైతు నుంచి కొనుగోలు చేశాం. మాకు తెల్వకుండానే మా భూమిని వెంచర్‌గా మార్చారు. ఈ విషయంపై మహేశ్వరం కోర్టును ఆశ్రయించి స్టే కూడా తెచ్చుకున్నాం. ఆర్డర్‌ కాపీ ఉన్నా, సబ్‌ రిజిస్ట్రార్‌ రిజిస్ర్టేషన్లు చేస్తున్నారు. మా భూమి 22ఏలో ఉన్నది. – పన్నాల శ్రీనివాస్‌రెడ్డి, బాధిత రైతు

ఈ ప్రశ్నలకు జవాబేది?!
వాస్తవానికి కొంగరకుర్దు-ఏ గ్రామ పరిధిలోని 2-400 సర్వేనంబర్లలోని ఇనాం భూములకు సంబంధించి గతంలో కబ్జాలో ఉన్న రైతులు అనేకమంది ఓఆర్‌సీలు పొందిన వారు ఉన్నారు. కానీ ఇప్పుడు రియల్‌ మాఫియా ఆ భూములకు మరో కొత్త ఓఆర్‌సీని సృష్టిస్తున్నది. అవి నకిలీవి అనేందుకు ఇంతకంటే మరో సాక్ష్యం ఏం కావాలి?

  • ఓఆర్‌సీ పొందిన వ్యక్తి అసలు కొంగరకుర్దు-ఏ గ్రామానికి చెందిన వాళ్లే కాకపోవడం అత్యంత కీలకమైన అంశం. నిజంగా ఆ భూముల్లో దశాబ్దాలుగా సాగు చేసుకుంటుంటే ఆధార్‌ కార్డులో వేరే ప్రాంత చిరునామా ఎందుకు ఉంటుంది? కనీసం ఓటరు జాబితాలో కూడా వాళ్ల పేర్లు కనిపించడం లేదు. ఎందుకు?
  • కొన్ని ఓఆర్‌సీలను పరిశీలిస్తే అసలు ఆ పేరు ఉన్న వ్యక్తి కొంగరకుర్దు గ్రామంలోనే లేడు.. ఎందుకు?
  • కొన్ని ఓఆర్‌సీల్లో ఆర్డీవో పేరు సరిగా లేదు.. ముద్రలు సరిగా లేవు. ఎందుకు?
  • ఇప్పటివరకు నమస్తే తెలంగాణ చేసిన విచారణలోనే దాదాపు 10-15 నకిలీ ఓఆర్‌సీలు అందుబాటులోకి వచ్చాయి. వీటిల్లో నాలుగైదు ఓఆర్‌సీల పేరిట రిజిస్ట్రేషన్లు, లేఅవుట్ల ప్రక్రియ జరిగింది. కారణమేంటి??

వాళ్లకు తెలుసు… మాఫియాకు అలుసు
గ్రామ సర్వేనంబర్లన్నీ వక్ఫ్‌ జాబితాలో ఉన్నాయి. 22ఏ నిషేధిత జాబితాలోనూ ఉన్నాయి. ముఖ్యంగా భూభారతిలో గ్రామానికి చెందిన రైతుల పేర్లు వస్తున్నాయి. అయినప్పటికీ కొత్త ఓఆర్‌సీలు, దశాబ్దాల కిందట నాలా కన్వర్షన్ల ప్రొసీడింగ్స్‌ పుట్టుకొస్తుంటే అధికారులు వెంటనే అప్రమత్తమై వాటిని నిలువరించి, విచారణ చేసి గుట్టు రట్టు చేయాలి. కానీ కొంగరకుర్దు విషయంలో మాత్రం అన్ని శాఖల అధికారులు వత్తాసు పలుకుండగా, వక్ఫ్‌ బోర్డు అసలు పత్తా లేకుండా పోయింది. రెవెన్యూ శాఖ అధికారులు భూములను వక్ఫ్‌ బోర్డు కాపాడుకోవాలి కదా అని సమాధానమిస్తున్నారు. తాము ఎలాంటి ఓఆర్‌సీలను ప్రోత్సహించి భూభారతిలో పేర్లు మార్చడం లేదంటున్నారు. పైగా వాటిని నిషేధిత జాబితాలో పెట్టాం కదా ఇంకేం చేయాలంటున్నారు.

హెచ్‌ఎండీఏ కనీస విచారణ, డాక్యుమెంట్ల పరిశీలన లేకుండా అడ్డగోలుగా, గుడ్డిగా అనుమతులిస్తున్నది. ఇక.. సందట్లో సడేమియాలా రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు రెవిన్యూ శాఖ అధికారాలను కూడా తామే నిర్వహిస్తూ.. ఓఆర్‌సీ, ప్రొసీడింగ్స్‌ మీద ఏకంగా చదరపు గజాల్లో రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఇదేమని రైతులు ప్రశ్నిస్తే కొన్నింటిని తిరస్కరించినట్టు చూపుతున్నారు. ఎకరాలకొద్దీ పూర్తయిన రిజిస్ట్రేషన్లపై నోరు మెదపడం లేదు. పైగా కోర్టు ఉత్తర్వులు ఉన్నాయని బుకాయిస్తున్నట్టు బాధిత రైతులు వాపోతున్నారు. వాస్తవానికి 22ఏ జాబితా నుంచి తొలగించి, రిజిస్ట్రేషన్‌ చేయాలని హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ సబ్‌రిజిస్ట్రార్‌ నేరుగా రిజిస్ట్రేషన్లు చేసే అధికారం లేదని రెవెన్యూ నిపుణులు చెప్తున్నారు.

ఓఆర్‌సీ, నాలా కన్వర్షన్‌ల ఆధారంగా సదరు వ్యక్తుల పేరిట రికార్డుల్లో భూమి మ్యుటేషన్‌ జరగాల్సి ఉంటుందని, ఆపై 22ఏ నుంచి తొలగించే అధికారం జిల్లా కలెక్టర్‌కు ఉంటుందని, ఆయన ఉత్తర్వులు ఇచ్చిన తర్వాతనే రిజిస్ట్రేషన్లు జరుపాల్సి ఉంటుందని వివరిస్తున్నారు. పైగా ప్రభుత్వం 2007లో జారీచేసిన వక్ఫ్‌ గెజిట్‌ను ఇప్పటివరకు ఉపసంహరించుకోలేదు. ఎలాంటి సర్వేనంబర్లను తొలగించలేదు. అలాంటప్పుడు ఆ సర్వేనంబర్లపై రిజిస్ట్రేషన్‌ చేయడం చట్టవిరుద్ధమని స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ హైకోర్టు ఉత్తర్వులుంటే వెంటనే వాటిని చాలెంజ్‌ చేయడం, వాస్తవాలను కోర్టు దృష్టికి తీసుకుపోవడం చేయాల్సి ఉంటుందన్నారు. అయితే ఇక్కడే అధికారులు తెలివిగా వ్యవహరిస్తూ కోర్టు ఉత్తర్వులంటూ పని కానిచ్చేస్తున్నారని బాధితులు కుండబద్దలు కొట్టినట్లు చెప్తున్నారు.

వాళ్లకే అధికారుల వత్తాసు
1999లో సర్వే నంబర్‌ 68, 69, 71, 72, 179 లో మా కుటుంబం 16 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. అప్పటి నుంచి మేమే కబ్జాలో ఉన్నం. సాగు చేసుకుంటున్నం. ప్రస్తుతం రికార్డులో మా పేర్లే వస్తున్నాయి. భూమిపై పూర్తి హక్కులు మాకే ఉన్నా.. కొంతమంది 1989 సంవత్సరం పేరిట నకిలీ ఓఆర్‌సీలు సృష్టించారు. హైకోర్టుకు వెళ్లి, కోర్టునే పక్కదారి పట్టించి ఆర్డర్‌ తెచ్చుకున్నారు. దానిని చూపెట్టి, సబ్‌రిజిస్ట్రార్‌, రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై నకిలీ డెవలప్‌మెంట్‌ రిజిస్ట్రేషన్లు చేసి వెంచర్‌లుగా మార్చి విక్రయాలు చేస్తున్నారు. మా భూములపై కొంతమంది నకిలీదారులు నకిలీ డాక్యుమెంట్లు చేస్తున్నా.. అధికారులు వారికే వత్తాసు పలుకుతున్నారు. ఏమిచేయాలో అర్థం కావడం లేదు. సబ్‌రిజిస్ట్రార్‌ను అడిగితే వారికి కోర్టు ఆర్డర్‌ ఉందని సమాధానం చెప్తున్నరు.
– జే జనార్దన్‌రెడ్డి, బాధిత రైతు

కోర్టు ఆర్డర్‌ ఉన్నా పట్టించుకోవట్లే
1994 సంవత్సరంలో సర్వేనంబర్‌ 193, 194, 195 లోని 4.30 ఎకరాల భూమిని భూపాల్‌రెడ్డి అనే రైతు నుంచి కొనుగోలు చేశాం. మాకు తెల్వకుండానే మా భూమిని వెంచర్‌గా మార్చారు. రోడ్లు వేశారు. ఈ విషయంపై మహేశ్వరం కోర్టును ఆశ్రయించి స్టే కూడా తెచ్చుకున్నాం. ఆర్డర్‌ కాపీ ఉన్నా, సబ్‌ రిజిస్ట్రార్‌ రిజిస్ర్టేషన్లు చేస్తున్నారు. భూభారతి ఆన్‌లైన్లో మా పేర్లు కనిపిస్తున్నాయి. మా భూమి 22ఏ లో ఉన్నది. రిజిస్ట్రేషన్లు ఎట్ల చేస్తున్నరో అర్థం కావడంలేదు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలి.
– పన్నాల శ్రీనివాస్‌రెడ్డి, బాధిత రైతు

అమ్మకంతో ప్రవేశించి.. ఆపై ఆక్రమించి

Story Board

కొంగరకుర్దు-ఏ గ్రామంలోని భూములను కొల్లగొట్టడంలో రియల్‌ మాఫియా పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకుపోతున్నది. ఇందుకోసం కందుకూరు ఆర్డీవో, మహేశ్వరం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు, ఆదిభట్ల పోలీస్‌స్టేషన్‌తో పాటు హెచ్‌ఎండీఏ కార్యాలయంలోని సంబంధిత అధికారులతో మంచి సంబంధాలను నెరుపుతున్నారు. ఆ తర్వాత దశలవారీగా భూములను కొల్లగొడుతున్నారు.

స్టెప్‌-1: తొలుత గ్రామంలో ఒక రైతుకు చెందిన భూమిని కొనుగోలు చేస్తున్నారు.
స్టెప్‌-2: వక్ఫ్‌ బోర్డు జాబితాలో ఉన్నందున అధికారికంగా భూభారతి ద్వారా రిజిస్ట్రేషన్లు జరుగవు. అందుకే ఎకరాకు రూ.80 లక్షలు మొదలు కోటి వరకు ఇచ్చి అనధికారిక ఒప్పందం చేసుకోవడంతో అప్పటివరకు కబ్జాలో ఉన్న రైతు పక్కకు తప్పుకొంటున్నాడు.
స్టెప్‌-3: తొలి రైతుతో ఒప్పందం పూర్తయ్యాక, ఆపై ఆ భూమికి ఆనుకొని ఉన్న భూయజమాని అయిన పక్క రైతుపై ఒత్తిడి తెస్తున్నారు. వింటే సరే.. లేకపోతే ఆక్రమణకు సిద్ధమవుతున్నారు.
స్టెప్‌-4: ఇందుకుగానూ ముందుగా అసలు గ్రామానికి సంబంధంలేని వ్యక్తి పేరిట ఓఆర్‌సీని సృష్టిస్తున్నారు. గతంలోనే నాలా అనుమతులు వచ్చినట్టు కన్వర్షన్‌ ప్రొసీడిం గ్స్‌ తయారు చేస్తున్నారు. వాస్తవానికి వీళ్లు రైతులకు డబ్బులిచ్చి అనధికారికంగా కొన్నది ఐదెకరాలైతే… ఓఆర్‌సీ, ప్రొసీడింగ్స్‌ను 17, 20 ఎకరాలకు తీసుకుంటున్నారు.
స్టెప్‌-5: ఈ రెండింటి ఆధారంగా హెచ్‌ఎండీఏ నుంచి లేఅవుట్‌ అనుమతి పొందుతున్నారు.
స్టెప్‌-6: ఓఆర్‌సీ, కన్వర్షన్‌ ప్రొసీడింగ్స్‌ ఆధారంగా సదరు వ్యక్తి పేరిట హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. తమ భూమి 22ఏలో ఉన్నందున తొలగింపు ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతున్నారు.
స్టెప్‌-7: 2022లో ఇచ్చిన ఉత్తర్వులను ఉటంకిస్తూ.. హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వడంతో మహేశ్వరం సబ్‌ రిజిస్ట్రార్‌ ఓఆర్‌సీ, కన్వర్షన్‌ ప్రొసీడింగ్స్‌ పేరుతో సదరు ఓఆర్‌సీ ఉన్న వ్యక్తి నుంచి మరో వ్యక్తికి గానీ, కంపెనీలకు గానీ డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్‌ చేస్తున్నారు.
స్టెప్‌-8: ఇక అంతే… ఓఆర్‌సీలో ఉన్న విస్తీర్ణం మేరకు భూమిని స్వాధీనం చేసుకొని కంటెయినర్లు వేసి రాత్రికి రాత్రి పెద్ద ఎత్తున యంత్రాలతో వెంచర్లు తయారు చేస్తున్నారు. రైతుల నుంచి కొన్నది కొం త భూమి కాగా… మిగిలిన భూమి ఆ రైతులకు తెల్వకుండానే ఆక్రమించుకొని వెంచర్లు చేస్తున్నారు. రాత్రివేళల్లో వందలాది మంది బౌన్సర్లను పెట్టి పనులు చేస్తుండటంతో రైతులు అక్కడికి వెళితే వారిని బెదిరించి పంపిస్తున్నారు.

అధికారులు వాళ్లకే వత్తాసు
1999లో సర్వే నంబర్‌ 68, 69, 71, 72, 179లో మా కుటుంబం 16 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. అప్పటినుంచి మేమే కబ్జాలో ఉన్నాం. సాగు చేసుకుంటున్నాం. ప్రస్తుతం రికార్డులో మా పేర్లే వస్తున్నాయి. భూమిపై పూర్తి హక్కులు మాకే ఉన్నా.. కొంతమంది 1989 సంవత్సరం పేరిట నకిలీ ఓఆర్‌సీ లు సృష్టించారు. హైకోర్టుకు వెళ్లి, కోర్టును పక్కదారి పట్టించి ఆర్డర్‌ తెచ్చుకున్నారు. దానిని చూపెట్టి, సబ్‌రిజిస్ట్రార్‌, రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై నకిలీ డెవలప్‌మెంట్‌ రిజిస్ట్రేషన్లు చేసి వెంచర్‌లుగా మార్చి విక్రయాలు చేస్తున్నారు. అధికారులు వారికే వత్తాసు పలుకుతున్నారు.
– జే జనార్దన్‌రెడ్డి, బాధిత రైతు

RELATED ARTICLES

Popular Articles