
కాగజ్‌నగర్ : కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం నార్లాపూర్ గ్రామంలో ఈ నెల 25న జరగనున్న సంఘ సంస్కర్త మహాత్మ జ్యోతిరావు ఫూలే విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఆదివారం కాగజ్‌నగర్ మండలం కోసిని గ్రామంలో మలిరే సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లెందుగు ఆధ్వర్యంలో కరపత్రాలను విడుదల చేశారు.
ఈ సందర్భంగా శ్యామ్‌రావు మాట్లాడుతూ జిల్లాలోని అన్ని మండలాల నుండి మాలి సంఘం నాయకులు, యువకులు, మహిళలు, మద్దతుదారులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాలి సంక్షేమ సంఘం నాయకులు, స్థానిక గ్రామస్తులు పాల్గొన్నారు.




