Sunday, October 25, 2026

Top 5 This Week

Related Posts

చంద్రుడు కనిపించలేదు… రేపు భారతదేశంలో ఈద్ – PARAHUSHAR NEWS

న్యూఢిల్లీ: గురువారం సాయంత్రం చంద్రుడు కనిపించకపోవడంతో రంజాన్ ఉపవాస మాసానికి ముగింపు పలికే ఈద్-ఉల్-ఫితర్ పండుగను శనివారం జరుపుకోనున్నారు. ఫతేపురి మసీదు ఇమామ్ ముఫ్తీ ముకర్రం అహ్మద్ మాట్లాడుతూ, మసీదుకు చెందిన రుయెట్-ఇ-హిలాల్ కమిటీ అనేక ప్రాంతాలను సంప్రదించగా, చంద్రుడు కనిపించడం లేదని సమాచారం అందించారు.

శనివారం దేశంలో ఈద్‌ను జరుపుకోనున్నట్లు తెలిపారు. జామా మసీదు నాయబ్ షాహీ ఇమామ్ సయ్యద్ షాబాన్ బుఖారీ కూడా చంద్రుడు కనిపించలేదని, శనివారం ఈద్ జరుపుకుంటామని ప్రకటించారు. శుక్రవారం రంజాన్‌ చివరి రోజని, 30వ రోజు ఉపవాస దినంగా ఉంటుందని తెలిపారు.

Popular Articles