
ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై దాఖలైన అనర్హత పిటిషన్‌పై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ చేపట్టనున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు విచారణ జరగనుంది. విచారణ సందర్భంగా పిటిషనర్ కేపీ వివేకానంద గౌడ్ వాదనలను స్పీకర్ నమోదు చేయనున్నారు. ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణలను పరిశీలించి అనర్హతపై నిర్ణయం తీసుకోవడం ఈ ప్రక్రియ లక్ష్యం.




