Saturday, October 10, 2026

Top 5 This Week

Related Posts

– PARAHUSHAR NEWS

ఇళయదళపతి విజయ్(విజయ్) వన్ మాన్ షో ‘జన నాయకన్’ (జన నాయకన్) చుట్టూ జరుగుతున్న హైప్, వివాదాలు రోజురోజుకూ సరికొత్త మలుపులు తిరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విజయ్ అభిమానులు మాత్రం జన నాయకన్ ఎప్పుడెప్పుడు థియేటర్స్ లో అడుగుపెడుతుందా అనే అతృతతో ఎదురుచూస్తూ ఉన్నారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా జన నాయకన్ సెన్సార్ రిపోర్ట్ విడుదల తేదీపై అనేక రకాల పుకార్లు వస్తున్నాయి. ఈ కోరికనే శనివారం రోజున ‘జన నాయకన్’ చిత్రం సెన్సార్ బోర్డు ‘A’ (అడల్ట్) సర్టిఫికెట్ ఇచ్చిందంటూ ఒక సెన్సార్ సర్టిఫికెట్ నెట్టింట విపరీతంగా వైరల్ అయింది. సుమారు 3 గంటల రన్‌టైమ్‌తో కూడిన ఈ నకిలీ పత్రంలో డైలాగ్స్ మ్యూట్ చేయడం, హింసను తగ్గించడం వంటి మార్పులను కూడా ప్రస్తావించారు.

అయితే, ఈ సెన్సార్ సర్టిఫికెట్ సోషల్ మీడియాలో వైరల్ అయిన కొన్ని గంటల్లోనే అసలు నిజం బయటపడింది. నెటిజన్లు ఆ సర్టిఫికెట్‌ను నిశితంగా పరిశీలించారు, గతంలో విజయ్ నటించిన ‘లియో’ (లియో) సినిమా ఒరిజినల్ సెన్సార్ సర్టిఫికెట్‌ని ఎడిట్ చేసి సృష్టించిన నకిలీ (ఫేక్) పత్రమని తేలింది. ఈ తప్పుడు ప్రచారానికి అడ్డుకట్ట వేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN ప్రొడక్షన్స్) మరియు బిజినెస్ హెడ్ సుప్రీత్ మోహన్ తక్షణమే స్పందించారు. సోషల్ మీడియాలో సర్టిఫికేట్ అవుతున్న సదరు సెన్సార్ సర్టిఫికేట్ పూర్తిగా నకిలీది.సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఇటీవల తాజా సమీక్షను పూర్తి చేసింది. అందులో భాగంగా కొన్ని తుది సవరణల (ఫైనల్ రివిజన్‌లు) జాబితాను పంపింది. ఆ సవరణలన్నీ పూర్తి చేసి బోర్డుకు సమర్పించిన తర్వాత అధికారికంగా సెన్సార్ సర్టిఫికెట్ జారీ అవుతుంది. బోర్డు సూచించిన తుది మార్పులను వేగంగా పూర్తి చేస్తున్నాము. అన్ని అనుకూలిస్తే జూలై చివరి వారంలో లేదా ఆగస్టు మొదటి వారంలో థియేటర్లలోకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నామని మేకర్స్ ప్రకటించడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇది కూడా చదవండి: Anirudh vs sai abhayankar: అనిరుధ్ వర్సెస్ సాయి అభయంకర్.. బాగుపడేది మాత్రం వాళ్ళే

Popular Articles