Saturday, October 17, 2026

Top 5 This Week

Related Posts

MBNR మేయర్‌ను సత్కరించారు – PARAHUSHAR NEWS

మహబూబ్‌నగర్‌ : మున్సిపల్‌ మేయర్‌ గుమ్మం మమతను ముదిరాజ్‌ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆదివారం ఘనంగా సన్మానించింది.

ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా విచ్చేసిన మెట్టుకాడి ప్రభాకర్ ముదిరాజ్ మాట్లాడుతూ తెలంగాణలో దాదాపు సగం జనాభా ఉన్న ముదిరాజ్ సామాజికవర్గానికి కాంగ్రెస్ పార్టీ తగిన ప్రాతినిధ్యం కల్పించిందన్నారు. రాజకీయాల్లో ముదిరాజ్‌ సంఘం సత్తాను చాటిచెప్పే అవకాశం లభించినందుకు మేయర్‌ను అభినందించారు.

కార్యక్రమంలో ముదిరాజ్‌ రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం నాయకులు యూనియన్‌ అధ్యక్షుడు సీరా నారాయణ, ప్రభుత్వాసుపత్రి రిటైర్డ్‌ ఏఓ గంజి లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు.

Popular Articles