
మహబూబ్ నగర్: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ఆధ్వర్యంలో 99 రోజుల పాటు నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా గురువారం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం చంద్రా గార్డెన్లో పోలీసు శాఖ, రోడ్డు రవాణా శాఖ ఆధ్వర్యంలో ‘అరైవ్ అలైవ్’ రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శివధర్ రెడ్డి హాజరయ్యారు.