Friday, October 9, 2026

Top 5 This Week

Related Posts

మంచు మనోజ్ టీమ్ లో మిస్టరీ డెత్.. చంపారా! చనిపోయాడా! – PARAHUSHAR NEWS

మంచు మనోజ్(మంచు మనోజ్)ప్రస్తుతం హనుమ రెడ్డి(హనుమ రెడ్డి)యాక్కంటి దర్శకత్వంలో ‘డేవిడ్ రెడ్డి'(డేవిడ్ రెడ్డి)చేస్తున్న విషయం తెలిసిందే. బ్రిటిష్ కాలం నాటి నేపథ్యంలో సాగే ఈ మూవీలో మంచు మనోజ్ మునుపెన్నడూ లేని విధంగా ఒక పవర్ ఫుల్ పీరియాడిక్ వారియర్ పాత్రలో నటిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సెట్స్ నుండి తాజాగా ఒక అత్యంత బాధాకరమైన వార్త బయటకు వచ్చింది.

ఈ చిత్ర నిర్మాణంలో కీలక భాగమైన ఒక ముఖ్యమైన చిత్ర బృందం సభ్యుడు (క్రూ మెంబర్) హఠాన్మరణం చెందడం టాలీవుడ్ వర్గాలని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. షూటింగ్ లొకేషన్‌లో అందరితో ఎంతో యాక్టివ్‌గా ఉండే వ్యక్తి ఇలా అకస్మాత్తుగా మరణించడంతో చిత్ర యూనిట్ మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది.

ఈ విషాదకర ఘటనపై హీరో మంచు మనోజ్ ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా మరణించిన ఆ చిత్ర బృందం సభ్యుడికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఒక ఎమోషనల్ ట్వీట్ చేశారు. కేవలం సంతాపం తెలపడమే కాకుండా, ఆ ట్వీట్‌లో మనోజ్ రాసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో మరియు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అనుమానాస్పద స్థితిలో మరణించడంతో మనోజ్ తెలంగాణ, కర్ణాటక డీజీపీలకి మరణం విషయంపై ట్వీట్ చేసి నిజనిజాలు వెలికి తీయాలని డిమాండ్ చేస్తున్నాడు.

ఇది కూడా చదవండి: Tollywood Trending: టాలీవుడ్ ట్రెండింగ్ లో ఈ రోజు న్యూస్ చూద్దాం

ఈ హఠాన్మరణం వల్ల ‘డేవిడ్ రెడ్డి’ సినిమా షూటింగ్ తాత్కాలికంగా విరామం ప్రకటించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ డెత్ మిస్టరీ మరియు మంచు మనోజ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.


Popular Articles