
సోమవారం నాగోల్ ఆర్‌టీఏ కార్యాలయం, ఉప్పల్ ఎక్స్ రోడ్డు సమీపంలోని పబ్లిక్ టాయిలెట్లను పరిశీలించిన సందర్భంగా మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టీ వినయ్‌కృష్ణారెడ్డి సఫాయి కర్మచారి సిబ్బందికి ఫినైల్, క్రిమిసంహారకాలు, బ్లీచింగ్ పౌడర్, టాయిలెట్ క్లీనర్‌లు, బ్రష్‌లు వంటి వాటిని నిత్యం వినియోగించి శుభ్రం చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా కమిషనర్ అక్కడ పనిచేస్తున్న సఫాయి కర్మచారితో మాట్లాడి మరుగుదొడ్ల నిర్వహణపై ఆరా తీశారు. గత 14 ఏళ్లుగా ఈ సదుపాయాన్ని కొనసాగిస్తున్నట్లు సఫాయి కర్మచారి తెలిపారు. మరుగుదొడ్లను ప్రజలు సౌకర్యవంతంగా వినియోగించుకునేలా పరిశుభ్రత, నీటి లభ్యత, నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
ఈ టాయిలెట్ కాంప్లెక్స్‌లో మొత్తం ఆరు యూనిట్లు ఉండగా, అందులో మూడు మహిళలకు, మూడు పురుషులకు కేటాయించారు. బోర్‌వెల్ ద్వారా నీటి సరఫరా చేస్తున్నామని అధికారులు తెలిపారు. కమిషనర్ వెంట నాగోల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సందీప్, డీఈఈ, ఇతర పారిశుధ్య సిబ్బంది ఉన్నారు.




