సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు, ఖమ్మం జిల్లా సీపీఏం జననేత కామ్రేడ్ యర్రా శ్రీకాంత్ గారు గుండెపోటుతో అమరులైనారు వారి సంతాప సభలో సిపిఎం ఇల్లందు మండల కమిటీ తీవ్ర సంతాపాన్ని తెలియజేసింది, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు అబ్దుల్ నబీ, పార్టీ ఇల్లందు మండల కార్యదర్శి ఆలేటి కిరణ్ కుమార్ లు పాల్గొని మాట్లాడుతూ
మదురైలో జరగుతున్న సిపిఎం జాతీయ మహాసభలకు ప్రతినిధిగా వెళ్లిన కామ్రేడ్ యర్రా శ్రీకాంత్ గారు నేడు ఉదయం గుండెపోటుతో మధురై లోని ఒక ఆసుపత్రిలో ఈరోజు మధ్యాహ్నం మరణించారని తెలిపారు. ఖమ్మం జిల్లా సిపిఎం పార్టీ లో వివిధ హోదాలలో పనిచేసిన జననేత ఖమ్మం పట్టణానికి తలమానికమైన మార్కెట్ ప్రాంతంలో అనేక కార్మిక, కర్షక, ప్రజా ఉద్యమాలు నిర్మించిన ఘనమైన చరిత్ర కలిగిన మహా నేత శ్రీకాంత్ అని వారు కొనియాడారు. ఈ సంతాపం సభలో మన్యం మోహన్ రావు, సుల్తాన, ఆలేటి సంధ్య, సర్వన్ కుమార్, మాదారపు వెంకటేశ్వర్లు, షేక్ ఖాదర్,కల్లేపల్లి మరియా, కడారీ వెంకటమ్మ, సత్యనారాయణ కోరి వజ్జ సురేష్, ఆర్బీజే రాజు,రాజమొగిలి, నల్లి నర్సయ్య, సోమ లక్ష్మీ, యాకమ్మ, మణి, మీనాక్షి,వీరయ్య, లక్ష్మీ నారాయణ తదితరులు పాల్గొన్నారు.




