
ఇప్పటికే తొలిదశలో 4000 మంది శిక్షణ పొందిన సర్వేయర్లకు లైసెన్సులు మంజూరు చేయగా, ఆదివారం ఖమ్మం జిల్లా కలెక్టరేట్‌లో మరో రెండు వేల మందికి లైసెన్సులు జారీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
రాష్ట్రంలో సరైన భూ రికార్డులు లేని 373 గ్రామాల్లో ఈ లైసెన్సు సర్వేయర్లను ఉపయోగించి రీసర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో రెవెన్యూ కార్యదర్శి లోకేష్ కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు, ఇంటెలిజెన్స్ అదనపు డీజీ విజయ్ కుమార్, ఉన్నతస్థాయి కమిటీ సభ్యులు డీఐజీ ఎం. సుభాషిణి, సీఎంఆర్‌వో మకరంద్, ఏసీబీ ఎస్పీ సింధు శర్మ, సైబర్ క్రైమ్ డీఎస్పీ ఎ. సంపత్, ఎన్‌ఐసీ ప్రతినిధి శ్రీనివాస్, హోంశాఖ సలహాదారు పి.శరత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.




