
ఖమ్మం
మంగళవారం ఇక్కడి త్రివేణి ఉన్నత పాఠశాలలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పాఠశాల డైరెక్టర్ గొల్లపూడి వీరేంద్ర చౌదరి, ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు జంక్ ఫుడ్‌కు దూరంగా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలని సూచించారు. విద్యార్థులు పౌష్టికాహారాన్ని ప్రదర్శించి ఆరోగ్యకరమైన ఆహారం పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.




