
వరంగల్: తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క బుధవారం వరంగల్ జిల్లాలో పర్యటించి ములుగు రోడ్డులో ప్రతిపాదిత క్రీడా భవనానికి, నార్తర్న్ పవర్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ భవనానికి శంకుస్థాపన చేశారు. పర్యావరణ పరిరక్షణపై సందేశం ఇస్తూ మొక్కలు నాటారు.
అనంతరం వరంగల్ కలెక్టరేట్ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్, కేఎంసీ విద్యుత్ సబ్ స్టేషన్, పోచమ్మ మైదాన్ విద్యుత్ సబ్ స్టేషన్, ఇంటర్ లింక్ లైన్ ప్రారంభోత్సవాల్లో ఆయన పాల్గొని ప్రజలకు అంకితం చేశారు.
కార్యక్రమంలో అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మీసాల ప్రకాశ్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు గోపాలన్ నవీన్ రాజ్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.




