
2028 డిసెంబర్‌లో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగవని పేర్కొంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు.మే-జూన్ 2029లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలతో అసెంబ్లీ స్థానాల సంఖ్య 119 నుంచి 182కి, లోక్‌సభ స్థానాలు 17 నుంచి 26కి పెరుగుతాయని ప్రకటించారు.
182 సీట్లలో తమ పార్టీ 117 సీట్లకు పైగా గెలుస్తుందని భద్రాచలం రాముడిపై ప్రమాణం చేస్తూ రేవంత్ రెడ్డి ప్రమాణం చేశారు.
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని జగన్నాథపురంలో చివరి విడత రైతు భరోసా ఆర్థిక సాయం పంపిణీ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాజీ సీఎం కేసీఆర్, బీఆర్‌ఎస్, బీజేపీలపై విమర్శలు గుప్పించారు.




