Wednesday, October 14, 2026

Top 5 This Week

Related Posts

రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ మరియు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి చిట్యాల డబుల్ బెడ్ రూమ్ కాలనీలో సౌకర్యాలను పరిశీలించారు – PARAHUSHAR NEWS

తెలంగాణ హౌసింగ్, వనపర్తి, 2బీహెచ్‌కే డిగ్నిటీ హౌసింగ్, వీపీ గౌతమ్, అర్బన్ డెవలప్‌మెంట్ తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతమ్ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కాలనీల నివాసితులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

సోమవారం తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్, జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభితో కలిసి వనపర్తి శివారులోని చిట్యాలలోని డబుల్ బెడ్‌రూం ఇళ్ల కాలనీని సందర్శించారు. ఈ సందర్భంగా కాలనీలో ఏర్పాటు చేస్తున్న మౌలిక వసతులను పరిశీలించారు.

కాలనీ పరిధిలోని పరిస్థితులు, ప్రస్తుతం నివాసితులకు అందుతున్న సౌకర్యాలపై జిల్లా కలెక్టర్ ఎండీకి వివరించారు. అనంతరం కాలనీలో అవసరమైన సౌకర్యాలను మరింత మెరుగుపరచాలని ప్రజారోగ్య, మున్సిపల్ శాఖల అధికారులను ఎండీ గౌతమ్ ఆదేశించారు.

కాలనీలోని ప్రభుత్వ భూమిని కొందరు వ్యక్తులు అక్రమంగా ఆక్రమిస్తున్నారని స్థానికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.

అంతేకాకుండా కాలనీలో అంగన్‌వాడీ కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) ఏర్పాటు చేయాలని నిర్వాసితులు కోరగా.. వీలైనంత త్వరగా వీటిని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.

కాలనీలో పారిశుధ్య సమస్యలను పరిష్కరించేందుకు సెప్టిక్ ట్యాంక్ సౌకర్యం కల్పించాలని పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులను ఎండీ గౌతమ్ ఆదేశించారు. ఈ పనులను త్వరితగతిన పూర్తి చేసి నిర్వాసితులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీఓ సుబ్రహ్మణ్యం, హౌసింగ్‌ పీడీ విఠోబా, సంబంధిత శాఖల అధికారులు, మున్సిపల్‌ సిబ్బంది, కాలనీ వాసులు పాల్గొన్నారు.

Popular Articles