
కరీంనగర్: హైదరాబాద్లో గురువారం జరిగిన కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) రాష్ట్రంలోనే అత్యుత్తమ పనితీరు కనబరిచిన డీసీసీబీగా ఎంపికైంది.
నాబార్డు 45 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం హైదరాబాద్లోని నాబార్డు ప్రాంతీయ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) రాష్ట్రంలోనే అత్యుత్తమ పనితీరు కనబరిచిన డీసీసీబీగా గుర్తింపు పొందింది.
కరీంనగర్ డీసీసీబీ తరపున సీఈవో ఎన్ సత్యనారాయణరావు, జనరల్ మేనేజర్లు బి.శ్రీధర్, మహ్మద్ రియాజుద్దీన్, డిప్యూటీ జనరల్ మేనేజర్ (డీజీఎం) బ్రహ్మానందరావు అవార్డును అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో వివిధ బ్యాంకుల అధికారులు, వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఉద్యాన విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల ప్రతినిధులు, నాబార్డు జిల్లా అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.




