
హనుమకొండ: శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీనివాస రామానుజన్ గణిత ఒలింపియాడ్‌లో పారామిత హెరిటేజ్ పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ఉన్నత ర్యాంకులు సాధించి విశేష విజయం సాధించారు.
ప్రధానోపాధ్యాయుడు గోపీకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. 10వ తరగతికి చెందిన పి.ప్రణవ్ చంద్ర మొదటి ర్యాంకు సాధించగా, 9వ తరగతికి చెందిన కశ్యప్ చెన్న పోటీలో ద్వితీయ ర్యాంక్ సాధించాడు.
గణితంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సంస్థ డైరెక్టర్లు, అధ్యాపకులు, సిబ్బందితో పాటు చైర్మన్ డాక్టర్ ఇ.ప్రసాదరావు అభినందించారు.