
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి ముస్లిం సమాజానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
పవిత్ర మాసమంతా ముస్లింలు పాటించే ఉపవాసాలు, ప్రార్థనలు ఆధ్యాత్మికతను, క్రమశిక్షణను, భక్తిని పెంపొందిస్తాయని ముఖ్యమంత్రి అన్నారు. దేశంలోనే లౌకికవాదం, మతసామరస్యానికి తెలంగాణ ప్రతిరూపంగా నిలుస్తోందన్నారు.
ముస్లింలు రంజాన్‌ను ఆనందంగా, శాంతితో జరుపుకోవాలని, సర్వశక్తిమంతుడైన అల్లా దీవెనలు పొందాలని ఆయన ఆకాంక్షించారు.




