
నాగర్ కర్నూల్: రైతులకు యూరియా పంపిణీలో పారదర్శకత, సులభతరమైన సేవలందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో ‘యూరియా బుకింగ్ యాప్’ను ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ ప్రకటించారు.
గురువారం కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి ఈ యాప్‌ను అధికారికంగా ప్రారంభించారు. రైతులు తమ మొబైల్ ఫోన్ల ద్వారా యూరియాను ముందుగానే బుక్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
జిల్లాలో ప్రస్తుతం 32 వేల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయని కలెక్టర్ తెలిపారు.




