
తుంగతుర్తి(సూర్యాపేట): తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న వర్గ విభేదాల నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ప్రకటించిన తొమ్మిది మండల కాంగ్రెస్ అధ్యక్షుల పదవుల్లో కొనసాగుతారని, వారి నియామకాల్లో ఎలాంటి మార్పు ఉండదని ఎమ్మెల్యే మందుల శామ్యూల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తుంగతుర్తిలోని తన క్యాంపు కార్యాలయంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రేగాటి రవి అధ్యక్షతన శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నాలో ప్రాణం ఉన్నంత వరకు ప్రకటించిన మండల అధ్యక్షులలో మార్పులు ఉండవని అన్నారు.
ఎవరి ఒత్తిడికి తలొగ్గే ప్రశ్నే లేదు” సామాజిక సమతూకం, ప్రాతినిథ్యం పాటిస్తూనే మండల అధ్యక్షుల ఎంపిక జరిగిందని శామ్యూల్ తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు వ్యక్తిగత విభేదాలను పక్కనబెట్టి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు. సహోద్యోగుల మధ్య చిన్న చిన్న అభిప్రాయభేదాలు సహజమేనని, కొత్తగా నియమితులైన అధ్యక్షులకు అందరినీ వెంట తీసుకుని ఇలాంటి సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.
నియోజకవర్గంలో పాత, కొత్త అనే తేడా లేకుండా కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసి విజయపథంలో నడిపించేందుకు ఐక్యంగా కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.




