Friday, October 9, 2026

Top 5 This Week

Related Posts

బీసీ చైతన్య వేదిక కొత్త టీమ్ ఎన్నిక – PARAHUSHAR NEWS

హైదరాబాద్: బీసీ చైతన్య వేదిక తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగం నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. రాష్ట్ర అధ్యక్షుడిగా నగేష్ సూర్యవంశం, ఉపాధ్యక్షుడిగా మేడిపల్లి గౌతమ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బైకిని రమేష్, అధికార ప్రతినిధిగా నాడి శివరాజ్, కార్యదర్శిగా శ్రీశైలం ఎన్నికయ్యారు.

తెలంగాణలో విద్యావ్యవస్థ గణనీయంగా దిగజారిపోయిందని ఆరోపిస్తూ నూతనంగా ఎన్నికైన విద్యార్థి విభాగం ఆందోళనకు దిగింది. రాష్ట్ర ప్రభుత్వం విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు, విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని సభ్యులు కోరారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులపై ప్రతికూల ప్రభావం చూపుతున్న జీఓ నెం.7ను వెంటనే ఉపసంహరించుకోవాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. పెండింగ్‌లో ఉన్న రూ.10,000 కోట్ల స్కాలర్‌షిప్ బకాయిలను కూడా విడుదల చేయాలని కోరారు.

Popular Articles