
ఖానాపూర్ : జన్నారం మండలం అక్కపల్లిగూడ, ధర్మారం గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలను అమెరికాకు చెందిన వాలంటీర్లు గాజుల లాస్య, తిరుమలశెట్టి హంసినిలతో కలిసి దిక్సూచి ఫౌండేషన్ ప్రతినిధులు గురువారం సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్బంగా విద్యార్థుల ఆంగ్ల భాషా నైపుణ్యాలను బేరీజు వేసి వారి విద్యా పనితీరును పెంపొందించే చర్యలపై చర్చించారు. ఫౌండేషన్ గత ఏడాది కాలంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యునైటెడ్ స్టేట్స్ నుండి ఆన్‌లైన్ తరగతులను నిర్వహిస్తోందని మరియు యుఎస్ తరహా అభ్యాస పద్ధతుల ద్వారా వారి విద్యా ప్రమాణాలను బలోపేతం చేయడానికి ప్రయత్నాలను కొనసాగిస్తుందని ప్రతినిధులు తెలిపారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు జాజాల శ్రీనివాస్, ఎంబాడి సత్తన్న, పొనకల్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ జక్కు సుష్మ-భూమేష్, వార్డు మెంబర్ ఎం. హారిక-రవి పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు.
కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.




