
హైదరాబాద్: పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, జాప్యం వల్ల వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు బుధవారం డిమాండ్ చేశారు. సోమాజిగూడలోని హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో జిఒ ఎంఎస్ నెం.7ను ఉపసంహరించుకోవాలని, ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని ప్రకటించారు.
ఈ సమావేశంలో మాజీ గవర్నర్, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ ప్రసంగిస్తూ విద్యారంగానికి రాష్ట్ర ప్రభుత్వ నిబద్ధత ఏంటని ప్రశ్నించారు. విద్యారంగ సంస్కరణలు, తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే లక్ష్యం గురించి ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, విద్యా రంగాన్ని బలోపేతం చేయకుండా అలాంటి లక్ష్యాన్ని సాధించలేమని ఆయన అన్నారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు నిలిపివేసి విద్యార్థులతో ప్రభుత్వం ఆటలు ఆడుకుంటోందని ఆరోపించిన ఆయన.. తక్షణమే సుమారు రూ.10 వేల కోట్లు విడుదల చేయాలని, జిఓ నం.7ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నిర్ణయం తీసుకునే ముందు కాలేజీ యాజమాన్యాలు, విద్యార్థి సంఘాలతో సంప్రదింపులు జరపాలని కోరారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులు.




