
కరీంనగర్: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఇటీవల నిర్వహించిన జాతీయ స్థాయి “సైన్స్ ఛాలెంజ్-2025” పోటీలో, భారతదేశం అంతటా 23,000 కంటే ఎక్కువ పాఠశాలల నుండి 1,50,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ పోటీల్లో పరమిత హెరిటేజ్ పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థి అన్నాడి అశ్రిత్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో 4వ ర్యాంకు సాధించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గోపీకృష్ణ తెలిపారు.
సిబిఎస్‌ఇ బోర్డ్ సైన్స్ ఛాలెంజ్-2025లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పాఠశాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన అశ్రిత్‌ని, ఈ ఘనత సాధించేందుకు కృషి చేసిన ఉపాధ్యాయులను పారామిత విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఇ.
ప్రసాదరావు ప్రత్యేకంగా అభినందించారు. ఈ విజయం పట్ల డైరెక్టర్లు ప్రసూన, రష్మిత, అనుకర్ రావు, వినోదరావు, వీయూఎం ప్రసాద్, హన్మంతరావు, ప్రిన్సిపాల్ గోపీకృష్ణ, కోఆర్డినేటర్లు నాగరాజు, రాము, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.




