
మే 10న నిర్వహించనున్న ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభను జయప్రదం చేయాలని పార్టీ కార్యకర్తలు, హిందూ నాయకులు, మోదీ మద్దతుదారులకు పిలుపునిచ్చారు.
మూడు రాష్ట్రాల్లో గెలుపొందడం వల్ల దేశవ్యాప్తంగా పార్టీకి ఆదరణ పెరిగిందని నేతలు పేర్కొన్నారు. తెలంగాణలో కూడా రాజకీయ మార్పులకు ఈ సమావేశం నాంది పలుకుతుందని అంటున్నారు.
తెలంగాణలో పార్టీ తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
హిందూ దేవుళ్లపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ.. ఆమె వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం హిందూ వ్యతిరేక ధోరణిని అనుసరిస్తోందని, ఆమెపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు ముఖ్యమంత్రిని కోరారు.
మోదీ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రానికి వేల కోట్ల అభివృద్ధి నిధులు వచ్చాయని, ప్రత్యేకించి వివిధ రాష్ట్ర పథకాలు, జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్రం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసిందని నేతలు గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా ప్రజలు మోదీని ఎంతో ఆదరిస్తున్నారని తెలిపారు.
సభకు వనపర్తి జిల్లా నుంచి ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు, రైలు సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు.
ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని సభను విజయవంతం చేయాలని బీజేపీ కార్యవర్గ సభ్యుడు పురుషోత్తంరెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో నాయకులు వేమా రెడ్డి, కంచె ఆంజనేయులు, రాఘవేందర్ గౌడ్, రామకృష్ణ, శివ, పట్టణ అధ్యక్షుడు క్రాంతి కుమార్, సర్వేష్, గోనెల అరవింద్, కార్తీక్, మోతె రాఘవేంద్ర పాల్గొన్నారు.
మీడియా సమావేశం.