
హైదరాబాద్: తమ నియోజకవర్గాల్లో డబుల్ బెడ్‌రూం ఇళ్ల సమస్యల పరిష్కారానికి పార్టీలకతీతంగా ఎమ్మెల్యేలందరితో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమావేశం కావాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సూచించారు. గృహ నిర్మాణ పథకం అమలుపై పలువురు ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు.
గతంలో అసెంబ్లీ సమావేశాల్లోనూ తాను ఇదే సూచన చేశానని స్పీకర్ గుర్తు చేశారు. ఇంతకుముందు ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని, కనీసం ఇప్పుడైనా సమావేశం నిర్వహించి వారి సమస్యలు పరిష్కరించవచ్చని అన్నారు.
దీనిపై మంత్రి స్పందిస్తూ.. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే అన్ని జిల్లాల ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.




