Friday, October 23, 2026

Top 5 This Week

Related Posts

జేఈఈ మెయిన్స్‌లో వాగ్దేవి ఐఐటీ అకాడమీ సత్తా చాటింది – PARAHUSHAR NEWS

మహబూబ్ నగర్ : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసిన జేఈఈ మెయిన్ పరీక్ష ఫలితాల్లో జిల్లా కేంద్రంలోని వాగ్దేవి ఐఐటీ అకాడమీ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు.

అకాడమీ నుండి చాలా మంది విద్యార్థులు టాప్ పర్సంటైల్స్ సాధించారు మరియు JEE అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించారు. సాధించిన వారిలో జోగు శివ, ముజామిల్ అలీ, స్పూర్తిరెడ్డి, కౌశిక్, వర్ష, అక్షయ కీర్తి, శైలజ, వెంకటేష్ వంటి వారు ఈ సంస్థకు గొప్ప గుర్తింపు తెచ్చారు.

ఈ సందర్భంగా కరస్పాండెంట్ విజేత వెంకట్‌రెడ్డి విజయం సాధించిన విద్యార్థులను అభినందించారు. వినూత్న శాస్త్రీయ బోధనా పద్ధతుల ద్వారా సగటు విద్యార్థులు సైతం అసాధారణ ఫలితాలు సాధిస్తుండడం గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు.

కార్యక్రమంలో ఐఐటీ-నీట్ అకాడమీ ఇన్‌ఛార్జ్ పావనిరెడ్డి, నిర్వాహకులు రాఘవేంద్రరావు, శివకుమార్, నాగేందర్, మేగ్యానాయక్, సతీష్ రెడ్డి, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

Popular Articles