Sunday, October 11, 2026

Top 5 This Week

Related Posts

జాగ్రత్త! పోలీసులు మిమ్మల్ని చూస్తున్నారు – PARAHUSHAR NEWS

గురువారం ఎమ్మెల్యే డాక్టర్ కె రాజేష్ రెడ్డి, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్.

నాగర్ కర్నూల్: నాగర్‌కర్నూల్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఎమ్మెల్యే డాక్టర్‌ కె రాజేష్‌రెడ్డి, జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సంగ్రామ్‌సింగ్‌ జి పాటిల్‌ గురువారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్ధవంతంగా వినియోగించుకుని పట్టణాన్ని సురక్షితంగా మార్చడమే అధునాతన నిఘా వ్యవస్థలను ఏర్పాటు చేయడమే లక్ష్యమన్నారు. నేరాల నివారణ, ట్రాఫిక్ నిర్వహణ, ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు భద్రత కల్పించడంలో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. సాంకేతికత వినియోగం వల్ల పోలీసింగ్‌ పటిష్టతతోపాటు ప్రజా భద్రత మెరుగుపడుతుందని ఆయన అన్నారు.

ఇదిలా ఉండగా, సమాజ భద్రతను పెంపొందించేందుకు తమ పరిసరాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు పౌరులు సహకరించాలని ఎస్పీ పాటిల్ విజ్ఞప్తి చేశారు.

Popular Articles