Friday, October 9, 2026

Top 5 This Week

Related Posts

‘జన నాయకన్’ చూసిన విజయ్ భార్య సంగీత?.. వీడియో వైరల్.! – PARAHUSHAR NEWS

దళపతి విజయ్ తన సినీ ప్రయాణానికి పలుకుతూ నటించిన ‘జన నాయకన్’ సినిమా ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ హడావుడి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న వార్త కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే తాజాగా విజయ్ భార్య సంగీత గురించి నెట్టింట ఒక వార్త చర్చనీయాంశంగా మారింది. అదేంటంటే.. చాలా కాలంగా విజయ్‌కు దూరంగా ఉంటున్న ఆయన భార్య సంగీత, ‘జన నాయకన్’ చూసేందుకు ఒక థియేటర్‌కు వచ్చిందనే ప్రచారం ఊపందుకుంది.

ఒక వీడియో ఆధారంగా సోషల్ మీడియాలో ఈ ప్రచారం వ్యాపించింది. సంగీత సడన్‌గా థియేటర్‌లో ప్రత్యక్షమై సినిమా చూశారని, విజయ్ ఆఖరి సినిమాకు ఆమె గుట్టుచప్పుడు కాకుండా తన మద్దతు తెలిపారని, వారిద్దరి మధ్య విభేదాలు తొలగిపోయి మళ్లీ కలిసే అవకాశాలు ఉన్నాయని అభిమానులు, నెటిజన్లు రకరకాల ఊహాగానాలు ప్రారంభించారు. దళపతి అభిమానులు కూడా ఈ వార్త చూసి నిజమేనేమో అని నమ్మి సోషల్ మీడియాలో ఆ వీడియోను భారీగా షేర్ చేయడం.

అయితే, సంగీత ‘జన నాయకన్’ థియేటర్‌కు వచ్చిన వార్త పూర్తిగా అబద్ధం అని తేలింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియో ‘జన నాయకన్’ సినిమా స్క్రీనింగ్‌కు సంబంధించినది కానే కాదు. అది 2023లో శివకార్తికేయన్ నటించిన ‘మావీరన్’ సినిమా ప్రీమియర్‌లకు సంగీత హాజరైనప్పటి పాత వీడియో క్లిప్.

విజయ్ చివరి సినిమా కావడంతో, అభిమానుల్లో ఉన్న క్రేజ్‌ను క్యాష్‌లో ఉన్న కొందరు నెటిజన్లు ఆ పాత వీడియోను రీ-అప్‌లోడ్ చేసి, రీసెంట్ వీడియోగా ప్రచారం చేశారు.

తలపతి విజయ్, జన నాయకన్, విజయ్ భార్య సంగీత, వైరల్ వీడియో

Popular Articles