Monday, October 12, 2026

Top 5 This Week

Related Posts

కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ – PARAHUSHAR NEWS

జగిత్యాల్: జగిత్యాల జిల్లాలోని ప్రముఖ కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాన్ని బుధవారం ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.

ఆలయాన్ని సందర్శించిన సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు వేద మంత్రోచ్ఛారణలతో సంప్రదాయ స్వాగతం పలికారు. ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు.

కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్.అంజనారెడ్డి, ఏఈవో గుండి హరిహరనాథ్, ఆలయ సూపరింటెండెంట్ ఉపాధ్యాయుల చంద్రశేఖర్, ఇతర ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Popular Articles