Monday, October 12, 2026

Top 5 This Week

Related Posts

కీసరలో ట్రాలీ ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు – PARAHUSHAR NEWS

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రాలీ ఆటోను గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను రాములు (60), రషీద్ (40)గా గుర్తించారు.

సమాచారం అందుకున్న కీసర పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మృతులిద్దరూ మెదక్ జిల్లా వాసులు. ట్రాలీ ఆటోను ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం డ్రైవర్‌ అక్కడి నుంచి పరారయ్యాడు.

పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మృతుల కుటుంబాలకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Popular Articles