Thursday, October 15, 2026

Top 5 This Week

Related Posts

కాళేశ్వరంలో వేలాది మంది పుణ్యస్నానాలు చేసి పూజలు చేశారు – PARAHUSHAR NEWS

జయశంకర్ భూపాలపల్లి: సరస్వతీ అంత్య పుష్కరాలు సందర్భంగా జయశంకర్‌భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వరముక్తేశ్వర స్వామి ఆలయాన్ని ఆచార్య సంవిదానంద సరస్వతి మహరాజ్ శనివారం సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఉదయం సరస్వతీ నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం ఆలయానికి చేరుకున్న మహరాజ్‌కు అర్చకులు వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య పూర్ణకుంభస్వాగతంతో సంప్రదాయ స్వాగతం పలికారు.

అనంతరం పీఠాధిపతికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించి, మహారాజ్ శ్రీ కాళేశ్వరముక్తేశ్వర స్వామిని ప్రత్యేక దర్శనం చేసుకున్నారు. శుభానంద దేవి ఆలయంగా ప్రసిద్ధి చెందిన పార్వతీ దేవి ఆలయాన్ని కూడా సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.

క్రతువులను అనుసరించి మహారాజ్ ఆశీర్వచనమండపంలో అర్చకులకు, భక్తులకు ఆధ్యాత్మిక సందేశాలు, ఆశీస్సులు అందజేశారు. ఆలయ అధికారులు ఆయనకు స్వామివారి ఉత్సవ వస్త్రాలను సమర్పించి సత్కరించారు.

కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మోహన్ శర్మ, ఆర్జేసీ రామకృష్ణ, ఈఓ మహేష్, ఆలయ అధికారులు, వేదపండితులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

అనంతరం మహారాజ్ మహా సరస్వతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు

Popular Articles