
మహబూబ్ నగర్ : ఖమ్మం జిల్లాలో మైనర్ బాలికపై అత్యాచారం చేసి హత్యాయత్నానికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీసీ సమాజం, ఇతర కుల సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఇతరులకు అడ్డంకిగా ఉండేలా పటిష్ట చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
శనివారం బీసీ సమాజం ఉమ్మడి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అఖిల భారత రజక సంఘం అధ్యక్షుడు నడిమింటి శ్రీనివాస్ మాట్లాడుతూ ఘటనను ఖండిస్తూ ఇది హేయమైన చర్యగా అభివర్ణించారు.
నిందితులను కఠినంగా శిక్షించాలని, బాధితురాలికి ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
బాలికకు మెరుగైన వైద్యం అందించి బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మోదాల శ్రీనివాస్‌సాగర్ కోరారు. కఠిన చర్యలు తీసుకోకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని, న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. వివిధ సంఘాలకు చెందిన నాయకులు కూడా మాట్లాడారు




