పవర్ స్టార్ ‘పవన్ కళ్యాణ్'(పవన్ కళ్యాణ్)పవర్ ప్యాక్డ్ అప్ కమింగ్ మూవీ ఓజి 2 . పవన్ స్వయంగా ఓ జి 2 పనులకి శ్రీకారం చుట్టడంతో నెక్స్ట్ సమ్మర్ కి వస్తుందేమో అని ఆశపడుతూ ఉన్నారు. కానీ పవన్ ఇటీవల భుజానికి శస్త్ర చికిత్స చేయడం, షూటింగ్ అప్ డేట్ కూడా లేకపోవడంతో వాళ్లంతా అప్ డేట్ కోసం ఎదురుచూస్తూ ఉన్నారు.
తాజా సమాచారం ప్రకారం, దర్శకుడు సుజిత్ స్క్రిప్ట్ వర్క్, ప్రీ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ తన పొలిటికల్ అండ్ అసెంబ్లీ షెడ్యూల్స్ ముగిసిన తర్వాత, నవంబర్ 2026 నాటికి OG 2 సెట్స్‌పైకి అడుగుపెట్టే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ ఈ భారీ ప్రాజెక్ట్ కోసం తగినంత డేట్స్ కేటాయించడానికి అంగీకరించారు. మొదటి భాగం కంటే రెట్టింపు యాక్షన్, జపాన్ మంచులో భారీ ఫైట్ సీన్స్, సరికొత్త ఐకానిక్ విజువల్స్‌తో OG 2 బాక్సాఫీస్ వద్ద సరికొత్త గ్యాంగ్‌స్టర్ శకాన్ని సృష్టిస్తోంది. దీపవన్ కళ్యాణ్, ఈ సీక్వెల్ నిర్మాణం కోసం తన సొంత బ్యానర్‌పై భాగస్వామ్యం వహించడం విశేషం. ఓజస్ గంభీరా జపనీస్ కనెక్షన్, యాకూజా గ్యాంగ్స్ తో ఉన్న పగ, ఇంకా బయటపడని గతం, అండర్ వరల్డ్ పాలిటిక్స్ ఆధారంగా ‘OG 2’ కాన్సెప్ట్ రూపొందించబడింది.
ఇది కూడా చదవండి: Jana Nayagan: జననాయకన్ సెకండ్ డే షాకింగ్ కలెక్షన్స్.. మరి ఇంత దారుణమా!
ఓజి 300 కోట్ల మార్కుని అందుకుని పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచిందే. దీంతో ఓజి 2 ని అంతకు మించిన హిట్ చెయ్యాలంటే పట్టుదలతో మేకర్స్ ఉన్నారు.
పవన్ కళ్యాణ్, OG2, OG, సుజీత్




