Sunday, October 25, 2026

Top 5 This Week

Related Posts

ఎఫ్‌ఎండీ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రాజేష్‌రెడ్డి – PARAHUSHAR NEWS

నాగర్‌కర్నూల్‌ : కాళ్లవాపు వ్యాధి నివారణకు ఉచిత టీకాలు వేసే కార్యక్రమాన్ని బుధవారం నాగర్‌కర్నూల్‌ జిల్లా మంతటి, తూడుకుర్తి గ్రామాల్లో ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి ప్రారంభించారు.

కార్యక్రమంలో 216 గేదెలకు, 156 పశువులకు ఎఫ్‌ఎండీ నివారణ టీకాలు వేశారు. కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మీకరుణాకర్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ వెంకటయ్య, మాజీ ఎంపీపీ నరసింహారెడ్డి, పశువైద్య సిబ్బంది మధ్య, శ్రీశైలం, వినయ్‌, సతీష్‌, కురుమూర్తి, పుల్లయ్య, పర్వతాలు, లింగస్వామి, ప్రవీణ్‌ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మండల పశువైద్యాధికారిణి డా.కల్పన మాట్లాడుతూ రైతులు తమ పశువులకు ఎఫ్‌ఎండీ టీకాలు వేయించాలని సూచించారు. రైతులు తమ పశువులను భారత్ పశుధాన్ యాప్‌లో నమోదు చేసుకోవాలని ఆమె సూచించారు. గుర్తింపు కోసం జంతువులకు చెవి ట్యాగ్‌లు కూడా జోడించబడ్డాయి మరియు వాటి వివరాలను యాప్‌లో అప్‌డేట్ చేశారు.

రైతులు తమ పశువులను కాపాడుకునేందుకు ఈ టీకా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Popular Articles