Saturday, October 17, 2026

Top 5 This Week

Related Posts

ఉప్పునూతలలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ సెంటర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ – PARAHUSHAR NEWS

నాగర్ కర్నూల్: ఉప్పునూతల మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా అందజేస్తున్న హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను 9 నుంచి 14 ఏళ్లలోపు బాలికలకు తప్పనిసరిగా వేయించాలని తల్లిదండ్రులను కోరారు. ఈ వ్యాక్సిన్ క్యాన్సర్ కారక వైరస్‌ల నుంచి రక్షణ కల్పిస్తుందని, ప్రభుత్వం చేపట్టిన ఈ ఆరోగ్య కార్యక్రమాన్ని ప్రజలు పూర్తిగా వినియోగించుకోవాలని సూచించారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉప్పునూతల కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లోనూ వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ మహిళలకు శుభాకాంక్షలు తెలిపి కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళా వైద్యులు డాక్టర్ స్వప్న, డాక్టర్ వాణి, నర్సింగ్ ఆఫీసర్లు ఉష, సుశీల, నిర్మల, విజయలతో కలిసి కేక్ కట్ చేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ శ్రీనివాసులు, జిల్లా వైద్యాధికారి రవికుమార్, డీఐవో డాక్టర్ సురేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి రజిత మల్లేష్, మండల పార్టీ అధ్యక్షుడు కట్టా అనంతరెడ్డి, వైద్యులు, వైద్య సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Popular Articles