
షాబాద్‌లో ఆరుగురిని దారుణంగా హత్య చేసిన నిందితుడు రాజ్‌కుమార్ సూర్యాపేట జిల్లా పరిసర ప్రాంతాల్లోనే ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సమాచారం సూర్యాపేట వ్యాప్తంగా కలకలం రేపింది. ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగి సోదాలు ముమ్మరం చేశారు.
సూర్యాపేటలో రాజ్‌కుమార్ సంచరిస్తున్నాడన్న అనుమానాల నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. నిందితుడి కదలికలపై చర్చించేందుకు సూర్యాపేట ఎస్పీతో డిసిపి వ్యక్తిగతంగా మాట్లాడి తీవ్ర తనిఖీలు నిర్వహించి ఎలాంటి ధరనైనా పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
అత్యంత ప్రమాదకరమైన ఈ హంతకుడి ఆచూకీ కోసం పోలీసులు విస్తృతంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
రాజ్‌కుమార్ ఆచూకీ తెలిపినా, అతడికి సంబంధించిన విశ్వసనీయ సమాచారం అందించినా రూ.2 లక్షల నగదు బహుమతిని అందజేస్తామని పోలీసు శాఖ ప్రకటించింది. ప్రస్తుతం సూర్యాపేట జిల్లాతో పాటు దాని పరిసర ప్రాంతాల్లో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు.
ప్రత్యేక నిఘా బృందాలను మోహరించడంతో హంతకుడిని త్వరలోనే పట్టుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ పరిణామాల మధ్య నిందితుడి అరెస్ట్ కోసం స్థానికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.




