
ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధికి రూ.15 కోట్లు మంజూరయ్యాయి.
శనివారం హైదరాబాద్లోని సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పట్టణాభివృద్ధి నిధుల మంజూరు కాపీని ఎమ్మెల్యే పాయల్శంకర్కు అందజేశారు.
మే నెలలో ప్రతిపాదించిన 52 అభివృద్ధి పనులను పూర్తి చేసేందుకు ఈ నిధులను వినియోగించనున్నట్లు శంకర్ తెలిపారు.
ఆదిలాబాద్ పట్టణంలోని పలు కాలనీల్లో సిసి రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు, బిటి రోడ్లు, గాంధీపార్కు సుందరీకరణ పనులు చేపడతామన్నారు.
అనంతరం నిధులు మంజూరు చేసినందుకు సీఎంకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.




