ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(అల్లు అర్జున్),స్టార్ హీరో ధనుష్(ధనుష్)..సినిమాల పరంగా ఈ ఇద్దరి మధ్య పోటీ గురించి చెప్పుకునే కన్నా, సినీ కళామతల్లికి దొరికిన ముద్దు బిడ్డలు. ఎలాంటి క్యారెక్టర్ లోనైనా తమదైన నటనతో మెస్మరైజ్ చేసి పడేస్తారు. ఇప్పుడు ఈ ఇద్దరకీ సంబంధించిన ఆసక్తికర న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ధనుష్ తన 55 వ చిత్రం ‘ఓం’ (OM). ‘అమరన్’ చిత్రంతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్నారు రాజ్‌కుమార్ పెరియసామి దర్శకుడు. దీనితో ‘ఓం’ పై ఇండస్ట్రీ వర్గాల్లోనూ, అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా చిత్ర యూనిట్ ‘ఓం – ఫస్ట్ స్ట్రైక్’ పేరుతో విడుదల చేసిన టైటిల్ అండ్ ఫస్ట్ గ్లింప్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ట్రెండింగ్ సాధిస్తోంది. దాదాపు 50 మిలియన్లకు పైగా స్‌ను అత్యంత వేగంగా సాధించివ్యూ రికార్డు స్థాయి క్రేజ్‌ను సొంతం చేసుకుంది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపధ్యం, సాయుధ తిరుగుబాటు, ఆయుధాల విస్ఫోటనం మరియు ఉత్కంఠభరితమైన యాక్షన్ సన్నివేశాలతో కూడిన ఈ ప్రమోషనల్ వీడియో ప్రేక్షకులకు అద్భుతమైన విజువల్ ఫీస్ట్ అందించడమే కాకుండా, ధనుష్ రఫ్ అండ్ ఇంటెన్స్ మాస్ లుక్‌తో నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్’ కి హామీ ఇస్తోంది.
ఈ భారీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌లో భారతీయ చిత్రసీమలోని దిగ్గజ నటులు భాగం కావడం మరింత ఆకర్షణీయంగా మారింది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఈ చిత్రంలో అత్యంత కీలకమైన మరియు శక్తివంతమైన పాత్రలో నటిస్తున్నారు. దాదాపు 13 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత (2013లో వచ్చిన ‘ప్రొప్రైటర్స్: కమ్మత్ & కమ్మత్’ తర్వాత) ధనుష్, మమ్ముట్టి కాంబినేషన్ మళ్లీ ఒకే తెరపై సాక్షాత్కరించిన దక్షిణాది చిత్రసీమ అంతటా విశేష ఆసక్తిని కలిగి ఉంది. దీనికితోడు, అద్భుతమైన నటనతో అలరించే నేచురల్ బ్యూటీ సాయి పల్లవి మరియు ఎనర్జిటిక్ గ్లామర్ క్వీన్ శ్రీలీల కథానాయికలుగా నటిస్తుండటంతో ఈ సినిమా స్టార్ కాస్ట్ మరింత గ్లామరస్‌గా, పవర్‌ఫుల్‌గా మారింది. రాజ్‌కుమార్ పెరియసామి అందించిన ఇంటెన్స్ నెరేటివ్ ఆధారంగా రూపొందించబడిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో ప్రతీ ఒక్కరి పాత్ర చాలా వైవిధ్యంగా ఉండబోతోందని.
ఇది కూడా చదవండి: RC 17 అప్ డేట్ ఇదేనా!. మెగా ఫ్యాన్స్ నిరుత్సాహం
సాయి అభ్యంగ్కర్ ఈ చిత్రం పవర్ ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరియు పాటలను అందించారు. అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ బాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదలయ్యేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. పుష్ప సిరీస్ లో అల్లు అర్జున్ గంధపు చెక్కల స్మగ్లర్ గా కనిపించిన విషయం తెలిసిందే. దీంతో సినీ ప్రేమికులు పుష్ప ని మించి ఓం సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నారు.
ధనుష్, అల్లు అర్జున్, OM, పుష్ప2
.webp.webp)




