Tuesday, October 13, 2026

Top 5 This Week

Related Posts

అపరిశుభ్రత, సిబ్బంది నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే, కలెక్టర్ అధికారులను నిలదీశారు – PARAHUSHAR NEWS

జయశంకర్ భూపాలపల్లి : జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రిలో బుధవారం నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో అస్తవ్యస్త పరిస్థితులపై ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆసుపత్రిలోని క్యాజువాలిటీ వార్డు, ల్యాబొరేటరీ, ఎంఆర్‌ఐ విభాగం, ఔట్‌ పేషెంట్‌ గదులతోపాటు వివిధ విభాగాలను నాయకులు సందర్శించి అందుతున్న వైద్య సేవల నాణ్యతను అంచనా వేశారు. క్యాజువాలిటీ వార్డులో కేవలం ఆరు పడకలు మాత్రమే ఉన్నాయని, ముఖ్యంగా అత్యవసర సమయాల్లో రోగులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని వైద్యులు తనిఖీలో తెలిపారు. ఈ విషయాన్ని గమనించిన ఎమ్మెల్యే, కలెక్టర్ 15 పడకలతో కొత్త క్యాజువాలిటీ వార్డు నిర్మాణానికి వెంటనే ప్రణాళికలు సిద్ధం చేయాలని టీజీఎంఐడీసీ అధికారులను ఆదేశించారు.

Popular Articles