
వరంగల్: వర్ధన్నపేట నియోజకవర్గం పరిధిలోని ఎనమాముల 14వ డివిజన్‌లో కాంగ్రెస్ సీనియర్ కార్యకర్త అడుప మహేశ్ కుటుంబసభ్యులను స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుతో కలిసి తెలంగాణ అటవీ, పర్యావరణ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సందర్శించి పెట్రోల్ దాడిలో మృతి చెందడంతో వారిని ఓదార్చారు.
కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన మంత్రి, ప్రభుత్వం వారికి అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కుటుంబాన్ని దృఢంగా ఉంచుకోవాలని, అవసరమైన అన్ని సహాయ, సహకారాలను అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె చెప్పారు.
ఈ ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, బాధితురాలికి న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కొండా సురేఖ హామీ ఇచ్చారు. ఈ కేసులో అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని కూడా ఆమె తెలియజేశారు.
ఈ పర్యటనలో మంత్రి వెంట వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అయూబ్, రాష్ట్ర యువజన నాయకుడు గోపాల నవీన్ రాజ్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


